దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి విలయతాండవం గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే గత కొన్ని రోజులుగా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సక్సెస్ కాలేకపోతున్నాయి.
 
దేశంలోని అన్ని రంగాలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ వైరస్ ప్రభావం పడింది. వైరస్ విజృంభణ నేపథ్యంలో శబరిమల యాత్ర ఉంటుందా..? ఉండదా..? అనే సందేహం భక్తులను కలవరపెడుతోంది. దేవస్వం మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ తాజాగా నవంబర్ 16వ తేదీ నుంచి శబరిమల దర్శనానికి భక్తులను అనుమతించబోతున్నట్లు తెలిపారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా శబరిమల యాత్ర ఉంటుందని అన్నారు.
 
కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు తెచ్చిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఐసీఎంఆర్‌ గుర్తింపు ఉన్న ల్యాబుల్లో మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని అన్నారు. సన్నిధానం, పంబ, నీలక్కల్‌ ప్రాంతాల్లో భక్తుల కొరకు వైద్య సేవలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులకు థర్మల స్క్రినింగ్ నిర్వహిస్తామని చెప్పారు. భక్తులకు మాస్కులు, శానిటైజలను అందిస్తామని అన్నారు.
 
భక్తులు కొండపైకి వచ్చే సమయంలో భౌతిక దూరం పాటించాలని వైరస్ బారిన పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కేరళ బస్సులను పంబా, నిలక్కన్ మధ్య నడపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పతనంతిట్ట కలెక్టర్‌ కేరళ సర్కార్ ను వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హెలికాఫ్టర్ సర్వీసులను నడపాలని సూచనలు చేశారు. మరోవైపు గత కొన్ని రోజుల నుంచి కేరళలో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు దేశంలో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 50,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదలైంది. ఈ వ్యాక్సిన్ పై పలు దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా రష్యా మాత్రం వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తోందని చెబుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: