టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు ఉండవు అంటూ సినీ నటి మాధవి లత ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ విషయం పై ఎక్సైజ్ శాఖ కొంచెం దృష్టి పెట్టాలని ఆమె సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అయితే ఆ మాటలు అనేక చర్చలకు దారి తీశాయి. అంతేకాదు సినీ ఇండస్ట్రీతో పాటుగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది. ఇక నెటిజన్ల విషయానికొస్తే మాధవి లత పై ఘాటు వ్యాఖ్యలతో కామెంట్లు పెట్టారు.అయితే ఆ విషయం మరోసారి చర్చలకు దారి తీసింది.


వివరాల్లోకి వెళితే.. తాజాగా ఈ విషయం పై తెలంగాణ  ఎక్సైజ్ శాఖ పోలీసులు స్పందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆరోపణలు చేస్తే సరిపోదు.. ఎక్కడ ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు అనే విషయం పై సరైన ఆధారాలు కావాలని అన్నారు.ఇటువంటి కాంప్లికేటెడ్ విషయాలను డీల్ చేయాలంటే పోలీసులకు లేదా ఎక్సైజ్ శాఖ వారికైనా ఆధారాలు ఉంటేనే ముందుకు వెళతారని చెప్పారు.


డ్రగ్స్ కేసు లో ఇప్పటివరకు చాలా మందిని అరెస్ట్ చేశామన్నారు. చాలా మంది పై తమ నిఘా కూడా ఉందన్నారు. ఐదు ఏళ్ళ క్రితం పార్టీలకు వెళ్ళితే అప్పుడే ఫిర్యాదు చేయాలన్నారు. డ్రగ్స్ విషయంలో ఎక్సైజ్ పోలీసులు కఠినంగా ఉంటామన్నారు. ఆధారాలు లేకుండా పోలీసుల పై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని వారు అన్నారు.గత పదకొండేళ్ల నుంచి ఈ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ లో కొనసాగుతుందని వెల్లడించారు. ఆధారాలు లేకుండా రైడ్ చేసిన వారికి నోటీసులు పంపిన పోలీసు శాఖ కు లేని పోని సమస్యలు తలెత్తుతాయని వారు పేర్కొన్నారు. అలా వారిచ్చిన ఘాటు రిప్లై కి నెటిజన్లు వారి స్టయిల్లో కామెంట్లను గుప్పిస్తున్నారు.మరి ఈ విషయం పై మాధవి లత ఎలా స్పందిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: