రజనీకాంత్ కు కరోనా పాజిటివ్ ?

తీవ్రమైన బ్లడ్ ప్రెషర్ సమస్యతో సూపర్ స్టార్ రజనీకాంత్ జూబ్లిహిల్స్ అపోలో హాస్పిటల్ లో ఇవాళ ఉదయం చేరారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ కు తీవ్ర అనారోగ్యం తలెత్తడంతో ఇవాళ ఉదయం హుటాహుటిన అపోలో హాస్పిటల్ కు తరలించారు. బీపీ అదుపులోకి రావడం లేదని ఆయన వైద్యులకు తెలియ చేయడంతో ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ కు తరలించి చికిత్స ప్రారంభించారు. 24 గంటలు గడిస్తే కాని ఏమీ చెప్పలేమని అపోలో వైద్యులు చెబుతున్నారు.

 కరోనా వైరస్ లక్షణాలతోనే హై బీపీ సమస్య తలెత్తి ఉండవచ్చని వైద్యుల అనుమానిస్తున్నారు. దీంతో ఆయనకు వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు నమూనాలు సేకరించారు. పాజిటివ్ లక్షణాలు ఏమాత్రం ఆయనలో కన్పించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. అన్నాత్తే కోసం రామోజీ ఫిల్మ్ సిటీ కి వచ్చి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆరుగురు షూటింగ్ సిబ్బందికి వైరస్ సోకడంతో షూటింగ్ ను ఈ నెల 22వ తేదీన వెంటనే నిలిపివేశారు. వైద్యుల సూచన మేరకు రజనీకాంత్ కూడా సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు.

22వ తేదీన జరిపిన పరీక్షల్లో రజనీకాంత్ కు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. ఏమీ లేకపోవడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. గురువారం రాత్రి నుంచి బ్లడ్ ప్రెషర్ నియంత్రణలోకి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. వైద్యుల సూచన మేరకు ఇవాళ ఉదయం ఆయన జూబ్లిహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో చేరారు. తాజాగా మళ్లీ నమూనాలు సేకరించిన వైద్యులు, నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 31న పార్టీ ప్రకటించే సమయంలో అస్వస్థత కు గురికావడంతో తమిళనాడుకు చెందిన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: