చాల మంది కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. కానీ సంపాదించిన డబ్బు పొదుపు విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోరు. కానీ.. సరిగ్గా పొదుపు చేస్తే లక్షలు సంపాదించొచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వానికి చెందిన పథకాలు, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి అనేక పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇక తక్కువ ప్రీమియంతో పాలసీ తీసుకొని కొన్నేళ్లపాటు పొదుపు చేస్తే లక్షల్లో రిటర్న్స్ వస్తాయి. ఎల్ఐసీ అందిస్తున్న పాలసీల్లో జీవన్ ఉమాంగ్ పాలసీ కూడా ఒకటి. ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే కేవలం రోజుకు రూ.199 చొప్పున పొదుపు చేస్తే చాలు. రూ.94 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు.

అంతేకాక ఈ పాలసీ ముగిసినా 100 ఏళ్ల వరకు కవరేజీ ఉంటుంది. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలా. ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఇన్స్యూరెన్స్ కవరేజీతో పాటు రెగ్యులర్ ఇన్‌కమ్ పొందొచ్చు. పాలసీహోల్డర్‌కు 100 ఏళ్ల వయస్సు వచ్చే వరకు కవరేజీ ఉంటుంది. ప్రీమియం చెల్లిస్తున్న సమయంలో పాలసీహోల్డర్ మరణిస్తే నామినీకి సమ్ అష్యూర్డ్ లేదా వార్షిక ప్రీమియంకు 7 రెట్లు లభిస్తుంది. చివరి వరకు ప్రీమియం చెల్లిస్తే సమ్ అష్యూర్డ్‌తో పాటు మెచ్యూరిటీ సమయంలో బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ లాంటివి కూడా రావొచ్చు. ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీపై లోన్ సదుపాయం కూడా ఉంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత సరెండర్ వ్యాల్యూలో 90 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు.

ఇక ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 90 రోజులు. గరిష్ట వయస్సు 55 ఏళ్లు. కనీసం రూ.2,00,000 సమ్ అష్యూర్డ్‌కు పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. పాలసీహోల్డర్లు 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకున్నాడనుకుందాం. 15 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.10,93,406. అంటే రోజుకు రూ.199 చొప్పున చెల్లిస్తే రూ.94,72,500 రిటర్న్స్ వస్తాయి. 15 ఏళ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత అంటే 40 ఏళ్ల వయస్సు నుంచి ఏటా 8% అంటే రూ.72,000 చొప్పున జీవితాంతం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: