హైదరాబాద్ లో ఎన్నికలు వచ్చాయంటే పార్టీల నేతల్లో  కొత్త జోష్ ఉరకలేస్తుంది. అధికార పార్టీ వర్సెస్ బీజేపి పోరు మొదలవుతుంది. మొన్నటి వరకు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఆసక్తి గా మారాయి.. ఇకపోతే ఇప్పుడు మరోసారి రచ్చ జరగబోతుంది. ఒకవైపు ఎన్నిక చెల్లదంటూ ట్రిబ్యునల్‌లో కేసు.. మరోవైపు జీహెచ్‌ఎంసీ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు.. ఇంకోవైపు కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం.. జూబ్లీహిల్స్‌ డివిజన్‌ నుంచి బీజేపీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికైన డేరంగుల వెంకటేశ్‌ వ్యవహారం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది.


జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు పార్టీలోకి వచ్చిన వెంకటేశ్‌కు టికెట్‌ ఇవ్వడం అన్నీ క్షణాల్లో జరిగిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత డివిజన్‌లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఇద్దరు పిల్లల నిబంధనను ఉల్లంఘించి గెలిచిన డేరంగుల వెంకటేశ్‌ ఎన్నికను రద్దు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ ఎన్నికల ట్రిబ్యునల్ ఆఫీసర్ ను కలిశారు. ఈ మేరకు ఈ కేసును మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో బీజేపి పార్టీ నేతలలో ఆందోళన మొదలైంది.


వాటితో సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌లో సమర్పించిన బర్త్‌ సర్టిఫికెట్లు ఫోర్జరీ చేశారంటూ ఇటీవల కాజా సూర్యనారాయణ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఎన్నికల ట్రిబ్యునల్‌ ముందు ఫిబ్రవరి 18 న విచారణకు హాజరు కావాలంటూ రెండురోజుల క్రితం డేరంగుల వెంకటేశ్‌తో పాటు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులందరికీ నోటీసులు అందాయి.. 11 న నామినేషన్ వేయాలా లేదా 18 న కోర్టుకు హాజరు కావాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ఎన్నిక విషయంలో మాత్రం మూడునెలల్లోనే విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజీనామా చేయాలని, తద్వారా ఉప ఎన్నిక వస్తుందని కొంతమంది బీజేపీ నాయకులు సూచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సొంత పార్టీ నేతలే అతన్ని గద్దె దిగమని చెబుతున్నారు. మరి ఈ విషయం ఎక్కడికి వెళ్తుంది.. ఎన్నికలు ఉన్నాయో లేదో సందిగ్ధం లో ఉన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: