క్షుద్ర పూజల విషయంలో ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చాలా మంది లెక్కలేని తనంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన సంచలనం అయింది. ఈ సంఘటన విషయంలో ఇప్పుడు ప్రజల్లో ఒకరకమైన భయం నెలకొంది. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచనలు చేసారు.

ఇక సమాజంలో ఇలాంటి వ్యక్తుల వలన ఇతరులు ఇబ్బంది పడతారు అని కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలని ఇతరులకు అది హెచ్చరిక కావాలని కోరుతున్నారు. ఇక ఇదిలా ఉంటే పెద్దపల్లి జిల్లాలో పోలీసులు  క్షుద్రపూజల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. 20 లక్షలు, బంగారం ఆశ చూపి దివ్య అనే యువతిని కొనుగోలు చేయడానికి ముఠా ప్రయత్నం చేసింది. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులో కి వచ్చాయి. క్షుద్రపూజల వెనుక మహారాష్ట్ర పూజారి ఉన్నారు.

బారిష్ పేరిట పూజలు చేయడానికి ఆ పూజారి ప్రయత్నం చేసాడు అని తెలిసింది. మహిళలతో పూజలు చేస్తే... డబ్బులు వర్షం కురుస్తాయనే నమ్మకం తో దివ్య అనే యువతిని ఎంపిక చేసిన క్షుద్రపూజల ముఠా... తల్లి తండ్రులను మభ్య పెట్టింది. రాజేందర్, కుమార్ ప్రధాన సూత్రధారులు కాగా.. మల్లమ్మ ,సరిత పాత్రధారులు అని అధికారులు గుర్తించారు. బారిష్ పూజ అనేది మోసం అని పోలీసులు వెల్లడించారు. బారిష్ ల నిధులు కురిసేందుకి ఓ సెట్ ఏర్పాటు చేసి...రసాయనాలతో వర్షం కురిసేలా ఏర్పాటు చేస్తారు అని వారు తెలిపారు. రసాయనాల కలయిక తో వర్షం తో పాటు డబ్బులు కురిసేలా చేసి అమాయకుల నుంచి లక్షలు దోపిడీ చేస్తున్నారు అని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: