చంద్రబాబు తన రాజకీయ జీవితం చరమాంకంలో పడిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లుగా తలపిస్తోంది తాజాగా ఆయన తాడేపల్లిలోని టీడీపి కార్యాలయం నుంచి మాట్లాడిన ప్రెస్ మీట్ ప‌లు సందేహాల‌కు తావిచ్చేలా ఉంది. ఆయన ప్రజల్లోకి రారు. ప్రెస్ మీట్స్, జూమ్ యాప్, పచ్చ మీడియాలను మాత్రమే నమ్ముతారు.. జగన్ మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం మీద పెట్టే శ్రద్ద, పార్టీని ప్రజలకు దగ్గరగా చేర్చే ప్రయత్నం మీద పెట్టరు. దేనినైనా మేనేజ్ చేయగలనన్న అహంకారం తప్ప ప్రజల కోసం పని చేయాల్సిన అవసరాన్ని గుర్తించరు. తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం... ఎదుటి వారిని తక్కువ అంచానా వేయడం మానుకోరు.

ఆయన డైరెక్షన్లో నిమ్మగడ్డ ఓవర్ యాక్షన్ ఎపిసోడ్స్ బెడిసి కొట్టిన వాస్తవాన్ని గుర్తించరు. సంక్షేమానికే పల్లె ప్రజలు పట్టం కట్టారన్న వాస్తవాన్ని గుర్తించరు. ఎన్నికల్లో డబ్బులు మద్యం పంచడం ఎరుగని నంగనాచిలా మైకు ముందు నీతులు చెప్పే అయనకు అసలు ఎన్నికల్లో ఓటుకు నోటు పధ్ధతిని అమలులోకి తెచ్చిన నేతగా తనపై ప్రజలలో ముద్ర పడిన విషయాన్ని ఎరుగనట్లు నటిస్తారు. నిన్న జరిగిన తొలిదశ ఎన్నికల్లో నారాకోడూరు అనే గ్రామంలో గెలుపు కోసం తెలుగు తమ్ముళ్లు ఓటుకు 2,500 రూపాయలు పంచినా తెలియనట్లు మాట్లాడడం అతనికే చెల్లింది.!

పాడిందే పాడరా.. పాచిపళ్ళ దాసుడా అన్నట్లుగా ఎంతసేపూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ ఖననం పైనే దృష్టి అంతా! పంచాయ‌తీ ఎన్నికల ఫలితాల విశ్లేషణలో కూడా సీఎం బాబాయి హత్య కేసు గురించీ, తెలంగాణలో షర్మిల పార్టీ గురించీ ప్రశ్నలు సంధించి సునకానందం పొందుతారు. రాయలసీమకు చెందిన షర్మిలకు తెలంగాణలో పనేంటి అనే ఈయన మాత్రం, ఏపీ సీఎంగా ఉండి తెలంగాణ ఎన్నికల్లో ntr గారు కుక్కమూతి పిందెలు అని ఈసడించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి నిస్సుగ్గుగా తిరగవచ్చు..! ఎదుటి వారిపై వ్రేలు పెట్టే సమయంలో మిగిలిన వేళ్ళు ఆయన్ను ప్రశ్నిస్తాయని గ్రహించని పెద్దమనిషి చంద్రబాబు..!

కన్ను ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట చంద్రబాబు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓ వైపు hmtv, Ntv, 10tv, Prime 9, tv 9 లాంటి ఛానళ్ళు పంచాయితీ ఎన్నికల మొదటి దశ ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకు పోతున్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నా దాదాపుగా పై ఛానళ్ళు అన్నీ 82% పంచాయతీలను వైసీపీ నాయకులు హస్తగతం చేసుకున్నారని ఘంటాపథంగా చెబుతున్నా ఏమాత్రం బెరుకు లేకుండా 38.74శాతం పంచాయితీలను టీడీపి గెలుచుకుంది అని అబద్దం గట్టిగా చెప్తారు. వైసిపి పతనం మొదలైంది అంటారు. కోర్టుల కెళ్ళి వైసీపీ ఆధిపత్యాన్ని అడ్డుకుంటానంటారు. అధికారులను బెదిరిస్తారు. ఏవేవో తయారు చేసుకొచ్చిన వీడియో లను డిస్ ప్లే చేస్తారు.

వాటి బదులుగా టీడీపీ గెలిచిందని చెప్తున్న 38.74 శాతం సర్పంచులకు పార్టీ కండువాలు కప్పి... వాళ్ళ.. ఫోటోలను పార్టీ వెబ్ సైట్లో ఉంచి ప్రదర్శించాలి. ఆ పని చేయలేదు. చెయ్యలేరు.. కూడా.. ఎందుకంటే అది నిజం కాదని అతనికి తెలుసు కాబట్టి. నిజానికి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన అబద్ధాన్ని అదే ఏబీఎన్ ఛానల్ చూపలేక పోయింది. ఉదాహరణకు విశాఖలో నువ్వా నేనా అన్నట్లుగా టీడీపీ వైసీపీలకు సర్పంచ్ స్థానాలు వచ్చాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రాసినా అదే విషయాన్ని abn చానల్లో మాత్రం ప్రసారం చేయలేదు. విశాఖలో టీడీపీకి కేవలం 23 స్థానాలు వచ్చాయని ఒకటి లేదా రెండు బీజేపీకి మినహాయించి మిగిలిన 240కు పైగా స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది అని సిగ్గుపడుతూ abn ఛానల్లో ప్రసారం చేశారు. ఎవరికైనా సందేహం ఉంటే చెక్ చేసుకోవచ్చు..!

 ప్రజలంతా  ఏకమైతే  వ్యవస్థలనూ  సవ్యంగా
నడిపించగలరని  గుర్తుంచుకోవాలి.

మీ
మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యాప‌క‌ అసోసియేష‌న్ అధ్య‌క్షులు
ఫోన్ నెం: 98666 43426
నల్లపాడు, గుంటూరు జిల్లా 

మరింత సమాచారం తెలుసుకోండి: