ఏపీ క్యాబినెట్ పునర్వవ్యవస్థీకరణ త్వరలోనే జరగనుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రమైన నిర్ణయాలకు సిద్ధం అవుతున్నాడా? ఏకంగా ఆరేడు మంది మంత్రులను తప్పించడానికి ఆయన రంగం చేస్తున్నాడా? ఇప్పటికే ఆ మంత్రులందరికీ తగిన సూచనలు వెళ్లాయా.. ఇలా అయితే కష్టం, రీ షెఫల్ లో మీకు స్థానం దక్కడం కష్టమే అని కూడా బాబు ఇప్పటికే చెప్పేశాడా?

అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. తన క్యాబినెట్ లోని చాలా మంది మంత్రుల పనితీరుపై బాబు అసంతృప్తితో ఉన్నాడట. ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఆరేడు నెలలు గడిచిపోయినా సదరుమంత్రులు ఇప్పటి వరకూ వేగాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారని.. వారు శాఖలపై పట్టు సాధించి తమ సత్తాను చాటలేకపోతున్నారని బాబు భావిస్తున్నాడట. ఈ విషయాన్ని బాబు వారి వద్దనే ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది.

సొంత వాళ్లు.. పార్టీకి ఎంతో కావాల్సిన వాళ్లు.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లూ అంటిపెట్టుకొన్న వాళ్లు.. వేరే ఆలోచన లేని వాళ్లే అయినా... సదరు మంత్రులపై మాత్రం బాబు అసంతృప్తితో ఉన్నాడట. వీలైతే వారిని క్యాబినెట్ నుంచి తప్పించడానికి బాబు సంసిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ జాబితాతో దశాబ్దాలుగా తెలుగుదేశంపార్టీతో అనుబంధం ఉన్న నేతలు ఉండటమే విశేషం. ఇలా బాబు క్యాబినెట్ నుంచి వైదొలగబోయే నేతల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చేశాయి. ఇది నిజంగా ఆసక్తికరమైన పరిణామమే. బాబు ఇంత తొందరగా సంచలన నిర్ణయాలు తీసుకొంటారా? లేక వారికి హెచ్చరికలతోనే సరిపెడతారా...? వెయిట్ అండ్ సీ!

మరింత సమాచారం తెలుసుకోండి: