ఈ మధ్య మహిళలపై, బాలికలపై అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. అమ్మాయిలు బయట తిరగాలంటేనే బయపడిపోతున్నారు. ఏ మూల నుంచి ఏ ముప్పు ఉందో అని జంకుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఐదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక(12) పై ఒక కామాంధుడు పలుమార్లు అత్యారాచం చేసి గర్భవతిని చేశాడు.

వివరాల్లోకి వెళితే.. హయత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నది. అదే ప్రాంతానికి చెందిన కృష్ణ (25) ఓ ప్రయివేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అంతే కాదు ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కాగా బాలిక తల్లి హోటల్ లో పనిచేస్తూ పొట్టపొసుకుంటున్నారు. కృష్ణ ఆ బాలికకు మాయమాటలు చెప్పి తన రూమ్ కి తీసుకెళ్లి పలుమార్లు అత్యారాచానికి పాల్పడ్డాడు. విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే బాలిక ఆరోగ్య పరిస్థతి బాగా లేకపోవడంతో తల్లి వైద్యుల్ని సంప్రదించగా బాలిక గర్భవతి అని తెల్చారు. బాలికను వివరాలు అడగా సదరు కామాంధుని గురించి బయట పెట్టింది. పోలీసులు కేసు బుక్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: