తెలంగాణ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరిత విప్లవం కార్యక్రమానికి జిల్లాల్లో పర్యటించడానికి సీఎం కేసీఆర్ కొరకు ఐదు కోట్లు వెచ్చించి ఒక అత్యాధునికమైన బస్సు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ బస్సుపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నాడని సమాచారం. 5 కోట్లు వెచ్చించి ప్రత్యేకంగా తిసుకోచ్చిన బస్సు తెలంగాణ ప్రగతి రథం ను అధికారులు పక్కన పెట్టారు. ఎందుకంటే అనుకున్నంతగా ఈ బస్సులో సదుపాయాలు సరిగా లేవట, అంతే కాదు సిట్టింగ్ సదుపాయం బాగాలేదట,ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టమ్స్ కూడా పని చేయటం లేదని కేసీఆర్ అధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రగతి రథం

kcr2

దీంతో ఇంత పెట్టుబడి పెట్టి ఎంతో గొప్పగా చెప్పుకున్న బస్సు తుస్సుమనిపించింది. దీంతో ఆయన అసంతృప్తిగానే రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లోని హరితవనం కార్యక్రమానికి రెగ్యులర్ కాన్వాయ్ లోనే వెళ్లారు. మరోవైపు బస్సును అధికారులు హయత్ నగర్ లోని బెంజ్ కంపెనీ గ్యారేజ్ కు చేర్చారు. బస్సులో ఉన్న లోపాలను, సీటింగ్ సిస్టమ్ ను మార్చనున్నట్లు తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: