మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందా అంటే అవుననే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు దేశం పార్టీ కీలక నేతలపై కేసులతో బయపెట్టిన ఏపీ ప్రభుత్వం ఎప్పుడు టిడిపి అద్యక్షుడి పైనే దృష్టి పెట్టింది. తెలుగుదేశం పార్టీ నేతలైనా అచ్చెన్నాయుడు, జే‌సి ప్రభాకర్ రెడ్డి వంటి వారు ఇప్పటికే పలు కేసులతో జైలు పాలైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా చంద్రబాబుపై ఏపీ సి‌ఐ‌డి నోటీసులు పంపడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. 

అమరావతి రాజధాని భూముల అక్రమాల వ్యవహారంలో చంద్రబాబు ఈనెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఏపీ సిఐడి కోరిన సంగతి తెలిసిందే.  ఎస్సీ ఎస్టీ చట్టం తో సహా 10 సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసు నమోదు అయ్యింది. ఈనెల 23వ తేదీన విచారణకు హాజరు కానీ పక్షంలో అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే దీనికి సంబందించి విచారణ పూర్తి అయ్యే లోపు మరో కీలక పథకంపై కూడా చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ పథకమే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన " నీరు-చెట్టు స్కీమ్ ".

 ఈ పథకం పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, ఆయా పనులపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం ఆ మద్య  హైకోర్టుకు వివరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీరు- చెట్టు పథకం కింద గత ప్రభుత్వం వందల కోట్లు వృధాగా ఖర్చు చేసిందని, అయినప్పటికి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ పథకానికి సంబంధించి అభివృద్ది జరగలేదని నేటి ప్రభుత్వం మొదటి నుండి కూడా  చెబుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి కూడా చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏది ఏమైనప్పటికి చంద్రబాబు కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: