మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారు కొత్త ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అందులో ప్ర‌ధానంగా కంటి చూపు కోల్పోతున్న‌వారి సంఖ్య పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్‌మైకోసిస్ ) సంక్రమించి కంటిచూపు పూర్తిగా పోతున్న‌ట్లుగా ఇప్ప‌టికే వైద్య నిపుణులు గుర్తించారు. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లో ఈ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ స‌మ‌స్య‌ను అరిక‌ట్ట‌కుంటే వేలాది మంది అందులుగా మారే ప్ర‌మాద‌ముంద‌ని చెబుతున్నారు. నయం చేయడానికి ఖర్చు కూడా ఎక్కువగా భరించ వలసి రావ‌డం మ‌రో స‌మ‌స్య‌గా మారింది. గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన ఓ వ్య‌క్తి మూడు వారాల క్రితం కరోనా నుంచి కోలుకున్నాడు. అయితే స‌ద‌రు వ్య‌క్తి బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డిన‌ట్లుగా వైద్యులు గుర్తించారు. ఇప్పుడు మా ఆస్పత్రిలో ఈ కేసుల సంఖ్య 50 కి పెరిగిందని, మరో 60 మంది చికిత్స కోసం ఎదురు చూస్తున్నారని సూరత్‌కు చెందిన ఒక ఆస్పత్రి అధిపతి మాధుర్ సహానీ చెప్పారు.


సూరత్, గుజరాత్‌ల్లోని ఇతర ప్రాంతాల నుంచి కూడా బాధితులు ఈ ఆస్పత్రికి తరలి వస్తున్నారు. ఈ కేసుల కోసం సూరత్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటైంది. మహారాష్ట్రలో ఈ ఫంగస్ వల్ల 8 మంది చూపు కోల్పోయారని ఆ రాష్ట్ర వైద్య విద్య పరిశోధన డైరెక్టరేట్ అధిపతి తాత్యారావు లహానే చెప్పారు. ఇదిలా ఉండగా గుజరాత్ ప్రభుత్వం ఈ రోగులకు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తోంది. ఫంగస్ బాధితుల వైద్యం కోసం 5000 వయస్స్ సేకరించింది. గుజరాత్ రాష్ట్రంలో ఇంతవరకు వంద కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో 19 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో అరవై పడకల వంతున రెండు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. వడోదర, సూరత్, రాజ్‌కోట్, భావనగర్, జామ్‌నగర్, తదితర ప్రాంతాల్లో ఇటువంటి సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయి.


మ‌హారాష్ట్ర‌లోనూ ఈ త‌ర‌హా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతుండ‌టం అక్క‌డి ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది.  ఇదిలా ఉండ‌గా దేశంలోని గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 3.53 లక్షల మంది కోలుకున్నారు. ఇదే స‌మ‌యంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,66,317 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా, ఇదే స‌మ‌యంలో క‌రోనా మృతుల సంఖ్య కొద్దిగా క్షీణించి 3,747 వద్ద ఆగిపోయింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,26,62,410కు చేరింది.  24 గంట‌ల్లో క‌రోనాతో 3,747 మంది మృతి చెంద‌గా, మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 2,46,146 కు చేరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: