మంత్రివర్గంలో మార్పులకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. తమ పదవులు కాపాడుకోవడానికి మంత్రులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ మాత్రం చాలావరకు పాతవారిని పక్కనబెట్టి, కొత్తవారికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. మరో ఆరు నెలల్లో జగన్ కేబినెట్‌లో మార్పులు చేయనున్నారు. ఈ క్రమంలోనే రాయలసీమలో ఎవరు పదవి ఉంటుందో? ఎవరి పదవి ఊడుతుందో?అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.


సీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. ఇక చిత్తూరులో మంత్రులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు ఉన్నారు. ఈ ఇద్దరిలో జగన్ ఎవరిని పదవి నుంచి తప్పించి ఎవరికి ఇస్తారో చూడాలి. పరిస్థితులని బట్టి చూస్తే పెద్దిరెడ్డి పదవి కంటిన్యూ అవుతుందని తెలుస్తోంది. జగన్ కేబినెట్‌లో సీనియర్‌గా ఉన్న పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించడం కష్టమే. ఇక నారాయణస్వామి పదవి విషయంలో గ్యారెంటీ లేదు.


అటు కర్నూలులో సైతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాంలు కేబినెట్‌లో ఉన్నారు. వీరిలో ఆర్ధిక మంత్రిగా ఉన్న బుగ్గన పదవి కొనసాగడం ఖాయం. ఎందుకంటే బుగ్గన ప్లేస్, రీప్లేస్ చేసే కెపాసిటీ వేరే నాయకులకు లేదనే చెప్పొచ్చు. ఇక మంత్రి జయరాం అనేక వివాదాల్లో ఉన్నారు. బెంజ్ కారు లంచం తీసుకున్నారని, భూ కబ్జాలు, పేకాట శిబిరాలు నడిపిస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. మరి జయరాం పదవి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


ఇక అనంతపురంలో మాలగుండ్ల శంకర్ నారాయణ కేబినెట్‌లో ఉన్నారు. ఈ రెండేళ్లలో శంకర్ నారాయణ మంత్రిగా పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. మరి శంకర్ పదవికి కూడా గ్యారెంటీ లేదని చెప్పొచ్చు. సీఎం సొంత జిల్లా కడపలో షేక్ అంజాద్ బాషా ఉన్నారు. ఈయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. అయితే అంజాద్ పదవి విషయంలో కూడా క్లారిటీ లేదు. మరి చూడాలి సీమలో జగన్ ఎవరిని పక్కకు తప్పిస్తారో?


మరింత సమాచారం తెలుసుకోండి: