ప్ర‌పంచ వ్యాప్తంగా రోజు కో కొత్త మోసం బ‌య‌ట‌కు వ‌స్తోంది. మోస‌పోయే వాళ్లు ఉన్న‌న్ని రోజులు మోసం చేసే వాళ్లు చేస్తూనే ఉంటుంటారు. తాజాగా ఆధార్ , పాన్ కార్డుల పేరుతో కొత్త మోసం వెలుగు చూసింది. పేద‌ల‌ను టార్గెట్ గా చేసుకుని వారి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తీసుకుని.. ఇదిగో ఇక్క‌డ వేలి ముద్ర‌లు వేయండి అంటూ వారిని బుట్ట‌లో వేసుకుంటున్నారు. ఇందుకు గాను వారికి రు. 200 నుంచి రు. 500 వ‌ర‌కు ఎర చూపుతున్నారు. ఆ ఏం ఉంది వేలి ముద్ర‌లు వేస్తున్నాం... ఆధార్‌, పాన్ జిరాక్సులే క‌దా ? ఇస్తున్నాం అని ఆ పేద వాళ్లు మోస పోతున్నారు. అయితే మోస గాళ్లు వీటిని ఆధారంగా చేసుకుని సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. వీటిని వాళ్లు ఆన్‌లైన్ ర‌మ్మీ ఆడేవాళ్ల‌కు ఎక్కువ ధ‌ర‌ల‌కు అమ్ము కుంటున్నారు.

విశాఖ జిల్లాలోని పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోన్న ఈ కొత్త మోసం గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. కొవిరి నాని అనే వ్యక్తి కొత్తపట్నంలో సెల్‌ షాప్‌ నడుపుతుంటాడు. అత‌లు ప‌లు ప్రైవేటు సెల్ కంపెనీలు సిమ్ లు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. అయితే అక్ర‌మ మార్గంలో డ‌బ్బు సంపాదించాల‌ని కొత్త ప్లాన్‌కు తెర‌దీశాడు. మ‌రో ముగ్గురు వ్య‌క్తుల‌తో క‌లిసి పేద‌ల ఆధార్, పాన్‌ కార్డుల ద్వారా సిమ్‌కార్డులను తీసుకుని... వాటిని ఎక్కువ ధ‌ర‌కు అమ్ముకుంటున్నాడు. ఈ సిమ్ ల‌ను ఆన్ లైన్ ర‌మ్మీ ఆడే వాళ్ల‌కు అమ్ముతున్నారు.

దీనిపై పోలీసుల‌కు స‌మాచారం రావ‌డంతో పోలీసులు ప‌క్కా ప్లానింగ్‌తో ఈ ముఠాను ప‌ట్టుకున్నారు. వీరిలో ప్ర‌ధాన సూత్ర‌ధారి అయిన  కొవిరి జగన్నాథంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవ‌రైనా ఆధార్‌, పాన్ జిరాక్సులు ఇచ్చి.. వేలిముద్ర‌లు వేస్తే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వ‌స్తాయ‌ని మీ ద‌గ్గ‌ర‌కు వస్తే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. లేకుండా వీరి మాట‌లు న‌మ్మితే మ‌నం మోస‌పోవ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: