దేశం మొత్తం ప్రస్తుతం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని అల్లాడి పోతుంది. కరోనా వైరస్ సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఆనందపడే లోపే.. రూపాంతరం చెందిన మరో వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతూ ఎంతో మంది పై పంజా విసురుతోంది. ఇక అంతకు ముందు ఉన్న వైరస్ కంటే మరింత ప్రభావం చూపుతోంది. మారణ హోమాన్ని సృష్టిస్తుంది మహమ్మారి కరోనా వైరస్.  ఈ క్రమంలోనే ఇక వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.  దీంతో ఇక వైరస్ పై పోరాటం చేయడమే ముఖ్యం అని భావిస్తున్నాయి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు. వైరస్ పై పోరాటం లో వ్యాక్సిన్ ఎంతో కీలకంగా మారిపోయింది.


 ఈ క్రమంలోనే అటు కేంద్ర ప్రభుత్వం కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తాము అంటూ ప్రకటించింది. ఇక ఆయా రాష్ట్రాలకు వ్యాక్సిన్ ల పంపిణీ ప్రక్రియను కూడా ప్రారంభించింది కేంద్రం. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా శరవేగంగా వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో అటు సోషల్ మీడియాలో కూడా వ్యాక్సిన్ కు సంబంధించి ఎన్నో తప్పుడు వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు ఇప్పటికీ వ్యాక్సిన్ విషయంలో ఎన్నో అనుమానాలు అపోహల్లో ఉన్నారు. టీకా వేసుకోవాలి అంటేనే భయంతో వణికి పోతున్నారు.



 ఇటీవల తమిళనాడులో జరిగిన ఘటన ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. టీకా తీసుకోవాలని అధికారులు ఒక సంచార తెగకు సూచించారు  అయితే ఆ సమయంలో ఆ సంచార తెగ చెప్పిన సమాధానంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. తాము అడవిలో ఉండే పక్షుల మాంసం తింటూ బతుకుతాము.. కాబట్టి తమకు కరోనా సోకదు అంటూ చెప్పుకొచ్చారు.  ఇక తమకు టీకా అవసరం లేదు అంటూ చెప్పినట్లు అధికారులు తెలిపారు. మీకు దండం పెడతాం కావాలంటే కత్తితో అయిన పొడవండి కానీ వ్యాక్సిన్ మాత్రం వద్దు అంటూ సంచార తెగ తెగేసి చెప్పిందట.  తమిళనాడులోని తిరునల్వేలి లో జరిగింది ఈ ఘటన.

మరింత సమాచారం తెలుసుకోండి: