ఏలియన్స్ ఉన్నారా.. లేదా అంత అవాస్తమేన.? అయితే ఏలియన్స్ భూమికి దగ్గరగా వస్తున్నారు అని ఎన్నోసార్లు అటు శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం కూడా యు.ఎఫ్.ఓ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక ప్రజలందరికీ ఎలియన్ సబ్జెక్టుపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం కూడా ఇలా జూలై 2వ తేదీన యు.ఎఫ్.ఓ డే  జరుపుకుంటారు. అయితే మొదట జూన్ 24వ తేదీన చాలామంది యు.ఎఫ్.ఓ డే జరుపుకునేవారు ఇక ఆ తర్వాత మరికొంతమంది జూలై 2వ తేదీన యు.ఎఫ్.ఓ డే జరూపుకునేవారు. తర్వాత కాలంలో  జూలై 2వ తేదీన అధికారికంగా ప్రపంచంలో యు.ఎఫ్.ఓ దినంగా ప్రకటించారు.



 ఇక అప్పటినుంచి ప్రజలందరు జూలై 2వ తేదీన ప్రపంచ యు.ఎఫ్.ఓ డే జరుపుకుంటూ ఉంటారు. 2001 లో యు ఎఫ్ ఓ పరిశోధకుడు హక్తన్ అక్టోగన్ అనే శాస్త్రవేత్త యుఎఫ్ఓ డే జరుపుకున్నారు. అయితే యు.ఎఫ్.ఓ ల పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఏవియటర్ కెన్నెత్ ఆర్నల్డ్ ప్రకారం... 1990లో వాషింగ్టన్ మీదుగా తొమ్మిది అసాధారణ వస్తువులు ఎగిరి వెళ్లినట్లు గుర్తించినట్లు ఆయన అనుభవాలను చెప్పుకొచ్చారు. అయితే ఇది  సరిగా జూన్ 24వ తేదీన ఇలా సాధారణ వస్తువులు గాలిలో ఎగిరినట్లు గుర్తించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు  న్యూ మెక్సికో లో 1947 లో జరిగిన యు.ఎఫ్.ఒ క్రాస్ జరిగింది. అయితే ఈ ఘటనకు జ్ఞాపకార్ధం గా జూలై 2వ తేదీన ఈ యు.ఎఫ్.ఓ రోజు జరుపుకుంటారు అని చెబుతున్నారు.



 ఈ క్రమంలోనే ఇక శాస్త్రవేత్తలు చెప్పినట్లు గానే జూలై 2వ తేదీన యు.ఎఫ్.ఓ డే జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజున ప్రజలందరూ వచ్చి ఆకాశం లో ఏవైనా అసాధారణ వస్తువులు ఎగురుతూ వెళ్తాయా అన్న విషయాన్ని చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఏలియన్స్ తరచూ యు.ఎఫ్.ఓ లో భూమికి దగ్గరగా వస్తుంటారని శాస్త్రవేత్తలు చెప్పగా.. జూలై 2వ తేదీన ఇలా యూ.ఎఫ్.ఓ లు గాలిలో వెళ్తున్నారా లేదా అని చూడటానికి అటు ప్రజలు అందరూ ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. మరికొంతమంది మాత్రం ఏలియన్స్ లాంటివి ఏమీ లేవు అంటూ కొట్టిపారేస్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం యు.ఎఫ్.ఓ లో ఏలియన్స్ మనుషులకు దగ్గరగా వచ్చి వెళ్తున్నారు అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ufo