నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియన్ రైల్వేలను పూర్తిగా ఆధునీకరించింది. ఇప్పటికే చాలా మార్గాల్లో రైళ్ల వేగం 120 కిలోమీటర్లుగా ఉంది. అలాగే అన్ని రూట్లను కూడా బయో టాయిలెట్ వల్ల మానవ వ్యర్థాలు లేకుండా చూస్తోంది మోదీ సర్కార్. అత్యాధునిక హంగులతో, ప్రయాణికులకు వేగవంతమైన, సుఖమైన ప్రయాణాన్ని అందించాలని కేంద్ర రైల్వే శాఖ భావిస్తోంది. ఇప్పటికే తేజాస్ పేరుతో ప్రైవేటు రైళ్లను కూడా నడుపుతున్న రైల్వే శాఖ... దేశంలోనే అతి వేగవంతమైన రాజధాని రైళ్లల్లో కీలక మార్పులు చేసింది. ప్రయాణీకుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని కొత్త రకం కంపార్ట్ మెంట్లను రాజధాని కోసం ప్రత్యేకంగా తయారుచేయించింది రైల్వే శాఖ.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రాజధాని రైలు కంపార్ట్ మెంట్ లకు రైల్వే శాఖ కొత్త హంగులు సమకూర్చబోతుంది. అన్ని బోగీలను స్మార్ట్గ్ గా తయారు చేస్తోంది. ప్రతి కంపార్ట్ మెంట్ కు కూడా ఇకపై అన్ని ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేస్తోంది. రైలు ఆగినప్పుడు మాత్రమే తలుపులు తెరుచుకుంటాయి. కదిలే ముందు డోర్లు మూసుకుంటాయి. ఇకపై రన్నింగ్ ట్రైన్ ఎక్కడానికి ఏ మాత్రం అవకాశం లేదు. అగ్నిప్రమాదాలను తప్పుకునేలా రైల్ లో సీట్లు తయారు చేశారు. పైర్ రెసిస్టెంట్ సిలికాన్ ఫోమ్ సీట్లు ఏర్పాటు చేశారు. ఇవి సాధారణ సీట్ల మాదిరి గట్టిగా కాకుండా... ఎంతో హాయిగా, మెత్తగా ఉండేలా డిజైన్ చేశారు. అలాగే ప్రతి సీటుకు కూడా మొబైల్, లాప్ టాప్ కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అప్పర్ బెర్త్ కు వెళ్లే వారు సులభంగా పైకి ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు.

ప్రతి కంపార్ట్ మెంట్ లో 24 గంటలు పనిచేసేలా సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే... వెంటనే మోగేలా ఫైర్ అలారం... అలాగే ప్రతి బోగీలో కూడా ఫైర్ రెసిస్టెంట్ ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు బయో వ్యాక్యుమ్ టాయిలెట్లు, పానిక్ బటన్లు, కుదుపుల్లేని ప్రయాణం కోసం క్వాలిటీ ఎయిర్ సస్పెన్షన్... హెవీ ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో అత్యాధునిక రైళ్లుగా పేరున్న తేజస్ ఎక్స్ ప్రెస్ లో ప్రస్తుతం ఇవే సౌకర్యాలు ఉన్నాయి. వీటిని ప్రయోగాత్మకంగా ముంబయి రాజధాని ఎక్స్ ప్రెస్ రైలుకు ఏర్పాటు చేసి ముంబయి-ఢిల్లీ మధ్య నడుపుతున్నారు. త్వరలోనే దేశంలోని అన్ని రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా స్మార్ట్ బోగీలతో రయ్ రయ్ మని పరిగెత్తనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: