
ఇందులో భాగంగానే రెండు రోజుల కింద... తెలంగాణ కాంగ్రెస్ లీడర్లతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీని ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై నే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా దళిత బంధు పథకం వైపునకు ఓటర్లు ప్రభావితం కాకుండా రేవంత్ రెడ్డి వ్యూహరచనలు చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున దళిత సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని తీసుకురావాలని కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.
హుజురాబాద్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దళిత అభ్యర్థిని నిలబెడితే... టిఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకు ను చీల్చే అవకాశం ఉన్నట్లు రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం దళిత అభ్యర్థి కోసం రేవంత్ రెడ్డి వేట మొదలు పెట్టారని సమాచారం. కాగా హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక కు ఇప్పటివరకు ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇక బిజెపి తరఫున ఈటల రాజేందర్ లేదా ఆయన సతీమణి ఈటల జమున పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటు టిఆర్ఎస్ పార్టీ తరఫున యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.