తిరుపతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గరుడ వారధి అనే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది అనే విషయం తెలిసిందే   అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభం అయ్యాయి. కాగా  ప్రస్తుతం జగన్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గరుడ వారధి విషయంలో ఇటీవల జగన్ కీలక నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. ఫ్లైఓవర్ పేరును మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం.



 గరుడ వారధి పేరును శ్రీనివాస సేతుగా మార్చింది జగన్ ప్రభుత్వం ఇక ఇటీవల తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే తిరుపతి ఎమ్మెల్యే గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గరుడ వారధి పేరును శ్రీనివాస సేతుగా  మార్చాలి అంటూ ఒక ప్రతిపాదన తెర మీదికి తీసుకురాగా ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతేకాదు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని అలిపిరి వరకు పొడిగించాలనే దానిపై కూడా ప్రస్తుతం టిటిడి పరిశీలిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక కొత్తగా నిర్మిస్తున్న ఈ ఫ్లవర్ నిర్మాణానికి అసలు ఇప్పటివరకు పేరు లేదు అంటూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం పిలుచుకుంటున్న గరుడ వారధి అనే పేరు సహేతుకంగా లేదని.. విష్ణువు వాహనదారుడు గరుడపై  వాహనాలు ప్రయాణించడం సరి కాదు అని అభిప్రాయంతోనే పేరు మార్చినట్లు చెప్పుకొచ్చారు.



 అయితే అటు గరుడ వారధి పేరు మార్పు పై మాత్రం టిడిపి తీవ్రస్థాయిలో మండిపడుతోంది  ఎన్నో పేర్లను పరిశీలించిన తర్వాతనే ఫ్లై ఓవర్ కు గరుడ వారధి అనే పేరు పెట్టాలని నిర్ణయించామని టిడిపి చెబుతోంది  అంతేకాదు ఇటీవలే ఫ్లైఓవర్ పేరును గరుడ వారధి అని తొలగించి  శ్రీనివాస సేతు అని మార్చడాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి కార్పొరేషన్ ఎదుట ఇటీవల నిరసన చేపట్టారు. ఇకపోతే ఏకంగా 684 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా పనులు వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుతం ఇక ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: