బీజేపీ-టీఆర్ఎస్ బంధాలు ఎలా ఉన్నా రోజుకోసారి అయినా తిట్ల పురాణం కమలనాధులు వినిపించక మానరు. వాళ్లు తిట్టడంలో, తిట్టించడంలో హై కమాండ్ ఆదేశాలు ఉన్నాయో లేవో కానీ వచ్చిన ఢిల్లీ పెద్దలు నాలుగు తిట్లు తిట్టిపోతే వారికో తుత్తి.


డబ్బులుంటే పథకాలు
డబ్బులు ఇప్పించే పథకాలు
ఇవీ తెలంగాణ రాజకీయాలు
అని అంటున్నరు బీజేపీ పెద్దలు


ఉపాధి హామీ పథకం నిధులను పక్కదోవ పట్టించారని బీజేపీ అంటోంది. ఇది తెలంగాణలో చెబుతున్న మాట. సగానికి సగం ని ధులు పక్కదోవ పోయాయని ఆధారాలతో సహా ప్రశ్నిస్తోంది. వీటిపై పోరాడే క్రమంలో ఉప ఎన్నికలను వాడుకునేందుకు చూస్తు న్నాయి కమలం పార్టీ వర్గాలు. నిధుల పక్కదోవకు సంబంధించి అటు ఏపీపై, ఇటు తెలంగాణపై ఎప్పటి నుంచో కోపంగానే ఉంది కేంద్రం. గతంలోనూ చంద్రబాబు ఇలానే చేసి కేంద్రం ఆగ్రహానికి గురయిన మాట మనం మరిచిపోకూడదు. తాజాగా ఉపాధి పథకం నిధులు ఇలా పక్కదోవలో వెళ్లిపోవడం బీజేపీ తన ఎన్నికల స్టంటుగా చూ పుతోంది.



కేసీఆర్ వ్యహహార శైలిని నిలువరించేందుకు కేంద్రం  చేస్తున్న కొన్ని ఎత్తుగడల్లో భాగంగా హుజురాబాద్ ఎన్నిక వాయిదా వేయడం అని తేలిపోయింది. త్వరలో దీనిపై నోటిఫికేషన్ వస్తుందో లేదో కూడా తేలడం లేదు. ఇంకొక వైపు బీజేపీ నేతలు తమ, తమ పరిధి లో గులాబీ దండును కట్టడి చేస్తూనే కేసీఆర్ తప్పులను ఏకరువు పెట్టేందుకు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి చేసిన ఖర్చులే తెరపైకి తెచ్చి ఇటు ఆంధ్రానే కాదు అటు తెలంగాణను ఇరకాటంలో పెట్టేస్తున్నారు. ఇప్పటికే పోలవరం సవరించిన అంచనాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పిన బీజేపీ, తాజాగా కాళేశ్వరంపై కూడా అదే బాణీలో స్పందింపజేస్తుంది తన నాయకులతో..మంత్రులతో.. ఇందులో భాగంగా కొత్త వివాదాలు ఆస్కారం పొందేందుకు వీలుగా కేంద్ర మంత్రుల సరళి ఉంది.



బీజేపీ తన మాటల పదును పెంచి, కేసీఆర్ పై అస్త్రాలు సంధించేందుకు సిద్ధం అయిన క్రమంలో ఈ సారి రంగంలోకి కేంద్ర మంత్రి దిగారు. ఆయన పేరు మురళీధరన్ గౌడ్ (కేంద్ర పార్లమెంటరీ పార్టీ వ్యవహారాల మంత్రి).. గౌడ గర్జనకు హాజరయ్యేందుకు హుజురా బాద్ వచ్చారు. ఈటెల నేతృత్వం వహించిన ఈ సభలో ఆయన అనేక వ్యాఖ్యలు చేయడంతో పాటు, విలేకరులకూ పలు విషయా లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపిస్తూ, ఎందుకు అలా అయిందో కూడా వివరిం చారు. తొలుత అంచనా వ్యయం నలభై వేల కోట్ల రూపాయలు కాగా తరువాత క్రమంలో 1,30,000 కోట్ల రూపాయలుగా చూపించి నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ, సంచలన వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: