అమెరికా ఆక్రమించుకున్న ఆఫ్ఘనిస్తాన్ కు తాలిబన్ల వల్ల విముక్తి లభించిందని, తదుపరి లక్ష్యం కాశ్మీర్ అంటూ అల్ కైదా ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఇతర ముస్లిం భూమిని విముక్తి చేయాలని ప్రపంచ ముస్లిం సమాజానికి పిలుపునిచ్చిన ఆల్ కైదా కాశ్మీర్ ను ప్రపంచ జిహాద్ తదుపరి లక్ష్యం జాబితాలో చేర్చింది. కానీ ముస్లిం మైనార్టీ లో అత్యంత దుర్భర జీవితం గడుపుతున్న చైనాలోని జిన్జియాంగ్, రష్యాలోని చెచన్యా ప్రాంతాలను  మాత్రం ఉగ్రవాద సంస్థ ప్రస్తావించకపోవడం గమనార్హం. అమెరికాపై తాలిబన్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఈ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ పోరాటం యొక్క తదుపరి దశ ప్రారంభించారని పిలుపునిచ్చింది. కాశ్మీర్ సహా  లెవాంట్ లేదా ఇరాక్, సిరియా, జోర్డాన్, లెబనాన్ లతో కూడిన మధ్య ఆసియా ను ఉగ్రవాదులు షార్ట్ లిస్ట్ చేశారు. లిబియా, మొరాకో, అల్జీరియా, మారిటానియా,  ట్యునీషియా, సోమాలియా లతో కూడిన వాయువ్య ఆఫ్రికా, యెమెన్ దాని ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయి.

అల్లాహ్ సహాయంతో ఈ చారిత్రాత్మక విజయం ఇస్లామిక్ ప్రపంచం పై పాశ్చాత్యులు విధించిన నిరంకుశ పాలన నుంచి విముక్తి సాధించడానికి మార్గాన్ని చూపింది అని పాకిస్తాన్ లోని ఆల్ఖైదా అధికారిక మీడియా అస్- షహబ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆల్ ఖైదా లక్ష్యాల జాబితాలో కాశ్మీర్ ప్రధానంగా ఉంది. ఆల్ ఖైదా సంస్థ జమ్ము కాశ్మీర్ అన్సార్ గజ్వతుల్ హింద్ ను ప్రారంభించినప్పుడు కాశ్మీర్ ను ప్రస్తావించింది . భారత్లో ఇస్లాం పునర్నిర్మాణమే తమ లక్ష్యమని గతంలో పేర్కొంది. అయితే చైనాలోని జిన్జియాంగ్, రష్యాలోని చెచన్యా లో ముస్లింలపై అఘాయిత్యాలు పాల్పడుతున్న వాటిని ఆల్ఖైదా మినహాయించడం వెనుక దాని  రాజకీయ ప్రయోజనం బయటపడింది. తాలిబన్ల కు మద్దతుగా చైనా, రష్యా ఇటీవల ముందుకొచ్చాయి.

ఆల్ఖైదా సంస్థ పాకిస్థాన్లో అయామన్  అల్ -జవహరిని తమ అధిపతిగా ప్రకటించింది. దీంతో తమకు ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ప్రకటన అనేది స్పష్టమవుతోంది. ముస్లింలను లక్ష్యంగా చేసుకున్న రెండు ప్రాంతాల గురించి ఆల్ ఖైదా ప్రస్తావించకపోవడం గమనార్హం. చెచన్యా లో రష్యా దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ఇరాక్, సిరియా లో పెద్ద సంఖ్యలో ఐఎస్ ఫైటర్ లను  ఏర్పాటు చేశారు . జింజియాంగ్ లోని ముస్లింలు అణచివేతకు గురవుతున్నట్టు పలు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. ఐరాస భద్రతా మండలి లో మంగళవారం నాటి 2694 తీర్మానం విషయంలో చైనా, రష్యాలు కలిసి పని చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: