తెలంగాణ రాష్ట్రం సంక్షేమ ప‌థ‌కాల‌లో దూసుకుపోతుంది. త‌మ పార్టీ ఎజెండా లిస్ట్‌ల్లో లేని కూడా ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. అయితే, ప‌థ‌కాల‌పై ఉన్న పిల్ల‌ల చ‌దువుపై లేద‌నే ఆరోప‌ణ వ‌స్తోంది. దీంతో విద్యార్థులు వారి త‌ల్ల‌దండ్రులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ముఖ్యంగా రెసిడెన్సియ‌ల్ విద్యా సంస్థ‌ల్లో చ‌దివే వేలాది విద్యార్థుల భ‌విష్య‌త్ అగ‌మ్య గోచ‌రంగా మారింది. హాస్ట‌ళ్ల పునఃప్రారంభంపై హైకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలు వెలువ‌రించినా రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం స్పందించ‌డం లేద‌ని తెలుస్తోంది.


అయితే, ప‌క్క‌నున్న ఆంధ్ర‌లో మాత్రం పిల్లల చ‌దువుపై అక్క‌డి ప్ర‌భుత్వం ప్రత్యేక దృష్టి సారించిన‌ట్టు క‌నిపిస్తోంది. అక్క‌డ కేవ‌ల విద్య కోసం ఐదు ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టింది. ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు విద్యార్థులంద‌రికి విద్యాదీవెన పేరుతో ఫీజు రియంబ‌ర్స్ మెంట్ అందిస్తోంది. ప్ర‌భుత్వ విద్యార్థుల‌కు విద్యా కానుక పేరుతో పుస్త‌కాలు, యూనిఫాం ఇలా ఎన్నో అందిస్తున్నారు. అలాగే అమ్మ ఒడి ప‌థ‌కం కింద పాఠ‌శాల‌ల‌కు త‌మ పిల్ల‌ల‌ను పంపిస్తే త‌ల్లిదండ్రుల ఖాతాలో ఏడాదికి 15 వేల‌ను వేస్తోంది.



గోరు ముద్ధ పేరుతో మ‌ద్యాహ్న భోజ‌నాన్ని అధ్బుతంగా పెడుతున్నారు. ఇక నాడు నేడు పేరుతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చి దిద్దుతున్నారు. ఇలా ఏడాదికి విద్య కోసం వేల కోట్ల‌ను ఖ‌ర్చ చేస్తోంది ఏపీ ప్ర‌భుత్వం. ఇటు తెలంగాణ‌లో ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల ప‌రిస్థితి అదోర‌కంగా ఉన్నాయి. ల‌క్ష‌ల మంది చిన్నారులు చ‌దువుకు దూరంగా ఉన్నార‌ని విద్యావేత్త‌లు చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌నాటి నుంచి విద్యావ్య‌వ‌స్థ‌లో ఎలాంటి మార్పు రాలేద‌ని ఇంకా అదోగ‌తికి వెళ్తోంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.


కేజీ టూ పీజీ వ‌ర‌కు ఉచిత విద్య అని చెప్పి పేప‌ర్ల‌మీద‌నే చెబుతున్నార‌ని ఫీల్డ్ లోకి వ‌చ్చి దాని అమ‌లు ఏ విధంగా ఉందో చూడాల‌ని ఉద్య‌మ‌నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. విద్యాసంస్థ‌లు ప్రారంభం అయి 15 రోజులు గ‌డుస్తున్న రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లోని హాస్ట‌ళ్లు తెరిచేందు ప్ర‌భుత్వం శ్ర‌ద్ద చూప‌డంలేద‌ని తెలుస్తోంది. కేవ‌లం ఓట్ల కోసం వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి ప్రజా ఆక‌ర్ష‌క ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతున్నార‌ని కానీ, విద్య‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విద్యావేత్త‌లు భావిస్తున్నారు.


   

మరింత సమాచారం తెలుసుకోండి: