భద్రత పై రాజీ లేదు
"ఇప్పటి వరకూ రహదదారులను అభివృద్ధి పరిచాం. ఎంతో వ్యయం చేసి ఈ పనులు చేపట్టాం. కొన్ని పూర్తయ్యాయి. మరి కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి భద్రత పై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. రహదారులు బాగు పడడం మూలంగా ప్రయాణ దూరం తగ్గింది. అదే సమయంలో వేగం పెరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇది చాలా బాధా కరమైన విషయం దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచనలు చేయాలి" అని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి  నితిన్ గడ్కరీ తన శాఖ అధికారులకు సూచించారు. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు కోరాలని ఆయన తెలిపారు.

జాతీయ రహదారి భద్రతా మండలి సమావేశంలో నితిన్ గడ్కరీ కీలకోపన్యాసం చేశారు. ట్రక్కులు తదితర కమర్షియల్ వాహనాలు నడిపే డ్రైవర్లు అలసటకు గురవడం కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని గడ్కరీ తెలిపారు. దేశంలో ట్రక్కుల వంటి వాణిజ్య వాహనాలు నడిపే వాహన చోదకులకు కూడా పని గంటలు నిర్దేశిస్తే ఎలా ఉంటుందో కౌన్సిల్ లో చర్చజరగాలని మంత్రి సూచించారు. రహదారుల భద్రత విషయంలో యూరోపిన్ దేశాలు అనుసరిస్తున్న ప్రమాణాలను చర్చించారు. విమానం నడిపే పైలెట్ల మాదిరి గానే వాణిజ్య అవసరాలకు ఉపయెగించే వాహనాల డ్రైవర్లకూ పని గంటలు నిర్ణయించడం సాధ్యసాధ్యాలను సమావేశం చర్చించింది.
కేంద్ర రవాణా, రహదారుల శాఖ ఈ ఏడాది జూలై 28న జాతీయ రోడ్డు భద్రతా మండలి (ఎన్ఆర్ఎన్ సి)ని ఏర్పాటు చేసింది. ఈ మండలిలో 13 మంది సభ్యులున్నారు. రెండు నెలలకు ఒక సారి ఈ మండలి సమావేశం అవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రాలలోనూ భద్రతా కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి ఉన్న రాష్ట్రాలు క్రమం తప్పకుండా  సమావేశాలు జరిగేలా చూడాలని పేర్కోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఎన్ఆర్ఎన్ సి లేఖలు రాసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: