బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాన్ రాత్రి తీరం దాటింది. దీంతో రెండు రాష్ట్రాల్లో నేడు అత్యంత భారీ కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శఖ హెచ్చరించింది. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 13రైళ్లు రద్దు చేసింది రైల్వేశాఖ. మరో 16రైళ్లను దారి మళ్లించింది. తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్రను వణించింది గులాబ్. ఈదురు గాలులు, వర్షాలు బీభత్సం సృష్టించాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో.. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, వరంగల్, కామారెడ్డి జిల్లాల్లో నేడు అత్యధికంగా భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు ప్రభావం మంగళవారం కూడా ఉండనుంది. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.

గులాబ్ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్ లో ఉదయం నుంచే జోరుగా వర్షం పడుతోంది. నగరంలో ఉరుములు, మెరుపులతో వానలు పడుతున్నాయి. జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్, అంబర్ పేట్, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం హయత్ నగర్ లోభారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీలో వానలు దంచికొడుతున్నాయి. వర్షాల వల్ల ఆఫీసులకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

గులాబ్ తుఫాన్ కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. కళింగపట్నంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ భారీగా వర్షాలు పడ్డాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. తీరం వెంబడి గంటకు 40-60కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మరోవైపు.. గడిచిన ఆరు గంటల్లో తుపాను బలహీన పడి వాయుగుండంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో గులాబ్ ప్రభావం ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: