పాండోరా పేపర్స్... ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 300 మంది పైగా ప్రముఖులు పన్ను ఎగ్గొట్టినట్లు పాండోరా పేపర్స్ లీక్ అయ్యాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ సంస్థ వెలుగులోకి తెచ్చింది. గతంలో పనామా పేపర్ల కుంభకోణాన్ని కూడా ఈ కన్సార్టియం బయటపెట్టింది. భారత్ సహా అనేక దేశాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు పన్ను ఎగ్గొట్టిన వారిలో ఉన్నారని రికార్డెడ్ గా రుజువు చేసింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మొదలు రిలయన్స్ సంస్థ అనిల్ అంబానీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త కిరణ్ మజుందార్ షా భర్త, దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పేర్లు కూడా అ పన్ను ఎగవేతదారుల జాబితాలో ఉన్నాయి. 350కి పైగా జాబితా ఉన్న భారతీయుల పేర్లలో... మొత్తం 60 వేరు వేరు రంగాలకు చెందినవారు ఉన్నారు. ప్రపంచంలో తక్కువ పన్ను వసూలు చేసే దేశాల్లో బినామీ పేర్లతో ఈ ప్రముఖులంతా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఐసీఐజే సంస్థ ఆధారాలతో సహా బయట పెట్టింది.

ఆడాగ్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ పేరు మీద మొత్తం 18 ఆఫ్షోర్ అస్సెట్ హోల్డింగ్ కంపెనీలు ఉన్నట్లు ఈ దర్యాప్తు లో తేలింది. లక్షల కోట్ల రూపాయల పన్ను ఎగొట్టేందుకు.. వ్యాపారులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ మార్గాన్ని పెంచుకున్నారని పాండోరా పేపర్ ల ద్వారా వెల్లడైంది. పన్నులను ఎగొట్టేందుకు.. దుబాయ్, స్విజర్లాండ్, పనామా వంటి దేశాల్లో బినామీ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసి... అవి నష్టాల్లో ఉన్నట్టు దొంగ లెక్కలు చూపించినట్లుగా తేలింది. పాండోరా పేపర్స్ వ్యవహారంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్ మంత్రులతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో పాటు పలు దేశాల ప్రధానులు, దేశాధినేతల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అఖిల్ కంపెనీలకు భారీగా నిధులు బదిలీ అయిన విషయాన్ని కూడా ఐసీఐజే బయటపెట్టింది. మొత్తం నాలుగు వేల వరకు ఆఫ్షోర్ కంపెనీలు సృష్టించారని... ఇవన్నీ కూడా నకిలీ సంస్థలు అంటూ డాక్యుమెంట్లు బయట పెట్టింది. పన్ను ఎగ్గొట్టేందుకు  కొత్తగా మూడు వందల యాభై కంపెనీల వరకు పుట్టుకొచ్చిన విషయాన్ని కూడా ఐసిఐజే వెలుగులోకి తెచ్చింది. బ్రిటన్ వర్జిన్ ఐలాండ్స్ లో కొత్త కంపెనీలకు అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీస్ జెయింట్..  మోర్గాన్ స్టాన్లీ సంస్థ సహకరించినట్లు పాండోరా పేపర్లు వెల్లడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: