కథానాయకుడి కథ ఓ పుస్తకం రాశారు ముళ్లపూడి వెంకట్రమణ అనే పాపులర్ రైటర్ ..ఆయన  అక్కినేని కుటుంబానికి ఎంతో దగ్గర.. మనం స్మరించుకునే బాపు - రమణల్లో ఒకరు..ఆయన రాసిన ఆ పుస్తకం ఎంతో ఫేమస్ అయింది. పేరు, కీర్తి వచ్చాక అక్కినేని ఎలాంటి వారో చెప్పిన పుస్తకం, రాకమునుపు కూడా ఆయన ఎలాంటి వారో చెప్పిన పుస్తకం.. ఇదే విషయం వారి కుటుంబంలో చర్చకు వినిపిస్తుందికపై! ఎందుకంటే పేరు, డబ్బు వచ్చాక అక్కినేని లా మిగిలిన హీరోలు లేరు .. ముఖ్యంగా ఆ కుటుంబమే అలా లేదు..అందుకే ఇతరులను అర్థం చేసుకునే స్థాయిలో వాళ్లు లేరు అన్న విమర్శ ఒకటి అన్ కండీషనల్ గా వినిపిస్తోంది .. సమంత వర్గం నుంచి.. తాను చెప్పిందే చేశానని చెబుతోంది సమంత.. కానీ అందుకు అంగీకారం తమకు లేదని అంటున్నాడు నాగ్ ... పైకి తీపి మాటలే కానీ ఇవన్నీ బేల మాటలే !

పై వాడు వేసిన ముడి అంటారు.. మరి! ఆ బంధాన్ని ఆయనే తుంచేస్తాడా మధ్యలో! అన్నది ఓ ప్రశ్న. ఇప్పుడీ ప్రశ్నే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఇద్దరూ విడిపోయాక ఎవరి జాతకం ఎవరిపై ప్రభావితం చేసింది అని చెప్పేందుకు వైదికులు పోటీ పడుతున్నారు. అప్పుడెప్పుడో మూడేళ్ల  క్రితం వేణు స్వామి అనే పండితుడు చెప్పిన మాటలే జాతకాలకు సంబంధించి చెప్పిన వివరాలే నిజం అయ్యాయన్న మాట ఒకటి అక్కినేని అభిమానులు విని  చదివి బాధపడుతున్నారు. తాము అభిమానించే కథానాయకుల కుటుంబానికి ఇటువంటి కష్టం ఊహించలేకపోతున్నామని కూడా అంటున్నారు.


సమంత - నాగ చైతన్య మధ్య బంధం తెగిపోయింది. ఈ విషయమై వాళ్లిద్దరూ ఓ క్లారిఫికేషన్ కూడా సోషల్ మీడియా ద్వారా ఇచ్చారు. వీరి ప్రేమ, పెళ్లి తరువాత పరిణామాలపై హీరో నాగార్జున కూడా భావోద్వేగంతో కూడిన మాటలు రాసిన సోషల్ మీడియా లో పోస్టు చేశారు. అంతేకాకుండా సమంతతో తాము చేసిన ప్రయాణం., తమ కుటుంబం గడిపిన కాలం ఎన్నటికీ గుర్తుండి పోతాయని కూడా అన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే చాలా రోజుల కిందట కుజు దోష నివారణార్థం సమంత చిత్తూరు జిల్లా , శ్రీకాళ హస్తీశ్వర ఆలయానికి వచ్చారు. పూజలు కూడా చేశారు. అవే పూజలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు కూడా! ఆమె పెళ్లిపై  కుజ గ్రహ  ప్రభావం ఎంత వరకూ ఉంటుంది అన్నది తెలియకున్నా, తాను ఎన్నడో ఆమె జాతకం గురించి చెప్పానని ఓ పండితుడు చెప్పిన మాటలే ఇప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వేణు స్వామి ఓ సందర్భంలో చై - సామ్ మధ్య వివాహ బంధానికి సంబంధించి చెప్పిన మాటలు స్మరించుకుంటున్నారు. అదే సందర్భంలో వేణు స్వామి చెప్పిన జాతకం రీత్యానే వాళిద్దరూ విడిపోయారని కూడా అనుకుంటున్నారు. ఇవన్నీ సైన్సు ఇంతగా రాణిస్తున్న రోజులలో ఫలిస్తాయా అన్నది మరో సందేహం.


మరింత సమాచారం తెలుసుకోండి: