ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి మాత్రమే లబ్ది చేకూరుతుంది అని శాసన సభలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆరోగ్య శ్రీ ద్వారా 87 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది అందుకే ఆరోగ్య శ్రీ ని అమలు చేస్తున్నాం అని అన్నారు. గత మే 18 2021 నెల నుండి ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేస్తున్నాం అని తెలిపారు ఆయన. మే 18 వతేది నుంచి 1,18,247 మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా చికిత్స అందించాము అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ,ఆయుష్మాన్ భారత్ రెండు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం అని ఆయన తెలిపారు.

 కరోనా, బ్లాక్ ఫంగస్ కు కార్పొరేట్ హాస్పిటల్ లకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్ లలో వైద్యం అందించాము అని అన్నారు మంత్రి. వేరే రాష్ట్రాల వారికి మనం  ఆరోగ్య శ్రీని డబ్బులు చెల్లించామని పేర్కొన్నారు. జీఎస్తీ బకాయులు కేంద్రం నుండి సకాలంలో ఇవ్వడం లేదు అని వ్యాఖ్యలు చేసారు. కరోనా కారణం గా బకాయిలను దఫా దఫాలుగా  2022 వరకు  ఇస్తామని కేంద్రం తెలిపింది అని ఆయన వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని 15 ఆర్ధిక సంఘం సూచించింది కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు అని అన్నారు.

ప్యాకేజ్ పై నిర్మల సీతారామన్ ను అడిగితే ఇప్పటి వరకు నిర్మల సీతారామన్ స్పందించలేదు అని అన్నారు. యాదవ సోదరులకు గొర్రెలు ఇచ్చినoదుకు ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలపాలి కానీ విమర్శించడం ఎందుకు అని మంత్రి ప్రశ్నించారు. కర్ణాటక కాంగ్రెస్ మాజీ మంత్రి యాదవ సోదరులకు గొర్రెలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు కానీ మీరు విమర్శిస్తున్నారు అని అన్నారు. గతంలో జీతాలు పెంచమని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు జీతాలు పెంచమని అడిగితే గుర్రాలతో, వాటర్ క్యాన్ లతో కొట్టించారు కానీ మేము కరోనా కష్ట కాలంలో 30 శాతం పీ ఆర్ సి పెంచామని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఉద్యోగస్తులకు జీతాలు లెట్ గా ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts