టి‌డి‌పి-జనసేనల పొత్తు అనివార్యమయ్యేలా ఉంది...వైసీపీని సింగిల్‌గా ఢీకొట్టడం కంటే...కలిసి ఢీకొడితేనే బెటర్ అని రెండు పార్టీలు ఫిక్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు ఒక నిర్ణయానికి వచ్చేలా కనిపిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే....వైసీపీలో పలువురు ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెక్ పడటం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు మంత్రులకైతే టి‌డి‌పి-జనసేనల వల్ల ఇబ్బందే అని తెలుస్తోంది.

టి‌డి‌పి-జనసేనల వల్ల నష్టపోయే మంత్రుల్లో కన్నబాబు, పినిపే విశ్వరూప్‌లు ఖచ్చితంగా ఉండేలా ఉన్నారు. ఎందుకంటే వారి నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఎక్కువగానే ఉంది. అంటే గత ఎన్నికల్లో జనసేనకు ఓట్లు బాగానే వచ్చాయి. కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్‌లో టి‌డి‌పి బలంగానే ఉంది...అదే సమయంలో జనసేనకు కాస్త ఓటింగ్ ఉంది.


గత ఎన్నికల్లో కన్నబాబు...టి‌డి‌పి మీద కేవలం 8789 ఓట్ల మెజారిటీతో గెలిచారు..కానీ ఇక్కడ జనసేనకు పడిన ఓట్లు వచ్చి 40 వేలు. అంటే గత ఎన్నికల్లోనే టి‌డి‌పి-జనసేనలు కలిసి ఉంటే కన్నబాబు పరిస్తితి ఏమయ్యేదో చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సారి ఎలాగో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని డిసైడ్ అవుతున్నాయి. సీటు ఏ పార్టీకి వచ్చినా సరే కన్నబాబుకు గెలుపుకు మాత్రం ఇబ్బంది అయ్యేలా ఉంది. ఆ ఓట్లని బట్టి చూస్తే డ్యామేజ్ జరిగేలా ఉంది.

ఇటు వస్తే మంత్రి విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గంలో అదే పరిస్తితి ఉంది. గత ఎన్నికల్లో విశ్వరూప్...టి‌డి‌పిపై 25 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. గెలవడానికి మంచి మెజారిటీతోనే గెలిచారు...కానీ ఇక్కడ జనసేనకు పడిన ఓట్లు వచ్చి...45 వేలు. అంటే విశ్వరూప్‌కు వచ్చిన మెజారిటీకి జనసేనకు పడిన ఓట్ల మధ్య తేడా 20 వేల ఓట్లు. అంటే టి‌డి‌పి-జనసేనలు కలిస్తే విశ్వరూప్ పరిస్తితి ఏం అవుతుందో కూడా చెప్పాల్సిన పని లేదు. మొత్తానికైతే టి‌డి‌పి-జనసేనలు కలిస్తే ఈ ఇద్దరు మంత్రులకైతే చెక్ పడేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp