రాజకీయ పార్టీలో టికెట్లు ఆశించని వారెవరుంటారు. ఎవరూ ఉండరు. అధికారం వస్తుందనే ఆశ ఉంటే పార్టీలలో టికెట్ల కోసం పోటీ కూడా పెరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. గతంలో సామాజిక సమీకరణలే టికెట్టు సాధించుకునేందుకు ప్రధాన ప్రాతిపదికగా ఉండేది. నేడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియా  ట్రోలింగ్ లో ప్రముఖంగా ఉన్న వారికి, సామాజిక మాధ్యమాల ద్వారా ఫేమ్ లో ఉన్న వారికి కూడా టికెట్లు దక్కుతున్న రోజులివి. అంతే కాదు... అందరికీ తెలిసిన విషయమే మరోకటుంది. అదే రాజకీయ వారసత్వం.
ఆంధ్ర ప్రదే శ్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాజకీయ వారసుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.   భవిష్యత్ లో ఎప్పుడు రాజకీయలు వచ్చినా  ఎన్నికల బరిలో దిగేందుకు ప్రస్తుత రాజకీయ వారసులు ఇప్పటి నుంచే పార్టీల ఎదుట  క్యూ కట్టారు.  ఏదో ఒక విధంగా తమ గుర్తింపును ప్రదర్శించే యత్నం చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి రాజకీయ పార్టీ కూడా దాదాపుగా తిరుపతి నుంచే ఎన్నికల ప్రచారం ఆరంభించడం ఆనవాయితీ.  తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)  పాలక మండలి మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి శాసన సభ్యుడిగా  ఉన్నారు. ఆయన వారసుడుగా అభినయ్ రెడ్డి ప్రజలకు చేరవయ్యో ప్రయత్నం చేస్తున్నారు. గత కొంత కాలంగా  రాజకీయాలలో చురుగ్గా పాల్గోంటున్నారు. ప్రస్తుతం అభినయ్ రెడ్డి తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ గా వ్యవహరిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు బహిరంగంగా పేర్కోంటున్నాయి. తిరుపతి మాజీ ఎం.ఎల్ ఏ  చదలవాడ కృష్ణమూర్తి వారసురాలిగా ఆయన సతీమణి సుచరిత ఇదే స్థానం నుంచి  జనసేన  అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు పేర్కోంటున్నారు. ఇదే జిల్లా కు చెందిన చంద్రగిరి నియోజక వర్గం ఎం.ఎల్.ఏ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన బదులు ఆయన కుమారుడు అవినాష్ రెడ్డి  రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.  ఇదే జిల్లాకు చెందిన  ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ కాళహస్తి . ఈ నియోజక వర్గం ఎం.ఎల్ ఏ బియ్యపు మధుసూధన్ రెడ్డి. ఆయన  కుమార్తే పవిత్ర రెడ్డి క్రియాశీలక రాజకీయాలలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలలో పాల్గోనడం తో పాటు,  అధికారులతో అనధికారికంగా సమావేశాలు సహితం నిర్వహిస్తుంటారని అక్కడ అందరూ చెప్పుకుంటుంటారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నిక ప్రచారాన్ని ఆరంభించే చిత్తూరు జిల్లా పరిస్థితి ఇది . ఇక ప్రతి జిల్లా లోనూ వారసుల క్యూ చాలా పెద్దిగా నే ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: