దేశంలో ఒకవైపు పేదరికం పెరిగిపోతుంది.
విద్యవిధానం బ్రష్టుపట్టిపోతుంది. వైద్యం అందలేక సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. కనీస అవసరాల ధరలు పెరిగిపోతున్నాయి. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నేడు
ఎన్నో సమస్యలతో దేశప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ పొరపాటు మాది కాదు గత ప్రభుత్వాలది అంటుంది నేడు పరిపాలిస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పడిపోయాక వేరే ప్రభుత్వం పరిపాలించడం మొదలుపెట్టక ఈ పొరపాటు మాది కాదు గత ప్రభుత్వాలది అంటుంది.

పార్టీలు పార్టీలు తిట్టుకోవడం ఒకరి మీద ఒకరి బురద జల్లడమే దేశరాజాకీయాల్లో కనిపిస్తుంది తప్ప పొరపట్లను సరిదిద్దుకొని ప్రజలకొఱకు పనిచేయాలనే ఆరాటం మాత్రం కనిపిస్తలేదు. రాజకీయ నాయకులకు జలుబు వచ్చిన కార్పొరేట్ ఆసుపత్రిలో వెళ్లి వైద్యం చేసుకుంటారు.
రాజకీయ నాయకుల పిల్లలను కార్పొరేట్ పాఠశాలలో చదివిపిస్తారు. విలాసవంతమైన భావనాలను కట్టుకుంటారు.
వీర ప్రభుత్వాన్ని పరిపాలించేది.. ? కరోణతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడిప్పుడేే కోలుకుంటున్న వారిపై ఈ ప్రభుత్వాలు తీవ్రంగా ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుంది. దీనిపై ప్రజానీకంం ఇప్పటికి కూడా ఆలోచించడం లేదు. దీంతో పాలించే వారిదేేేే రాజ్యం అవుతుంది.


వీరు మిడియాముందు వచ్చి విద్య బాగాలేదు వైద్యం బాగాలేదు అంటూ సొల్లు కబుర్లు చెప్పుతారు. ఆ పార్టీపార్టీ అని నేను మాట్లాడడం లేదు. ఏ పార్టీ అయిన కూడా సామాన్యులను న్యాయం చెయ్యడం లేదు. ప్రజలారా ఇప్పటికైనా స్పందించండి. మన కూడు గూడు గుడ్డ దోచుకుంటున్నారు. మనం ప్రశ్నించకపోతే మనం పోరాటం చెయ్యకపోతే మనం చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా మనం ఆలోచించకపోతే కొద్దిరోజుల్లో మన దేశం కూడా  మరో సిరియా దేశం లా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయో పాలన ఇలా ఎందుకు సాగుతోందో ఆలోచించాలి. దీనికి కారణమైన ప్రతి దానిపై ప్రశ్నిస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: