అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో భారీగా ఐఏఎస్సుల బదిలీ చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ఇరిగేషన్ స్పెషల్ సీఎస్సు గా కెఎస్ జవహర్ రెడ్డిని నియామకం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అంతే కాకుండా టీటీడీ ఈఓ గా జవహర్ రెడ్డి కి అదనపు భాద్యతలు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా శ్యామల రావు ను నియామకం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అంతే కాకుండా క్రీడలు,యువజన సర్వీసుల శాఖ స్పెషల్ సీఎస్సుగా జి. సాయి ప్రసాద్ ను ను నియామకం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.  

ఆర్థిక శాఖ కార్యదర్శి ( కమర్షియల్ టాక్స్ ) గా ముఖేష్ కుమార్ మీనా ను నియామకం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం. అంతే కాకుండా పాఠశాల విద్యా శాఖ కమిషనరు గా  ఎస్.సురేష్ కుమార్ ను నియామకం చేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం.  మరియు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరు గా వి. చిన వీర భద్రుడు ను నియామకం చేస్తూ ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం.  సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ గా పి. రంజిత్ బాషా ను నియమిస్తూ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం ప్రతిష్టాత్మక మైన నిర్ణయం తీసుకుంది.  అలాగే  చేనేత డైరెక్టరు గా సి.నాగ రాణి ను నియామకం చేసేసింది జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం.  

అంతే కాకుండా బీసీ సంక్షేమ శాఖ డైరెక్టరు గా పి. అర్జున్ రావు ను నియామకం చేస్తూ సంచలన నినరియం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేశారు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ. మరో వారం రోజుల్లోనే ఈ బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు అందరూ కొత్త బాధ్యతలను చేపట్టాలని అఖిల ఉత్తర్వుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  సమీర్ శర్మ స్పష్టం చేశారు.  దీనిపై ప్రతి ఒక్కరు సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను ఫాలో కావాలని రాష్ట్ర శర్మ కుండబద్దలు కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: