
- రాజకీయమే పట్టని వాడు
ఇంతటి పెద్దవాడు ఎలా అయ్యాడో?
బాగా తెలుసు నాకు సజ్జల ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణా రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణా రెడ్డి అనే పెద్దాయన. బాగా తెలుసుకున్నాకే ఆయన గురించి రాయడం మాట్లాడడం మొ దలుపెట్టాను. అప్పుడు అంటే సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ (ఈడీ) హోదాలో ఆయన ఇలా లేరు. రాజకీయ దృక్పథాలు ఎవరివి ఎలా ఉన్నా గౌరవించేవారు. అస్సలు వైఎస్సార్ అంటే ఇష్టమే లేదని, ఏముంది ఈ ప్రభుత్వం కాకపోతే మరో ప్రభుత్వం వస్తుంది.. ఇందులో గొప్పేమీ లేదు అని ఆ రోజు ఇంటర్వ్యూలోనే చెప్పాన్నేను. నవ్వుకున్నాను కూడా! (సాక్షి ఫస్ట్ బ్యాచ్ మాది..అప్పటి పే రు : సాక్షి అకాడమీ ఆఫ్ జర్నలిజం) ఇప్పుడున్నంత హైప్ కానీ సీన్ కానీ ఆ రోజు ఆయనకు అంటే సజ్జల రామకృష్ణా రెడ్డికి లే వు. ఆ మాటకు వస్తే జగన్ కు కూడా లేవు. ఏముంది ఓ ముఖ్యమంత్రి అబ్బాయి ఆయన అంతే ! అంతకుమించి ఆయనకున్న పేరూ,కీర్తీ ఏవీ లేవు.
జగన్ సర్ ! మా స్కూలుకు వస్తాడా అని మాత్రం అడిగాం అక్కడున్న వారికి..లేదు లేదు రారు అని చెప్పారు. అంతకుమించి జ గన్ కు కానీ రామకృష్ణా రెడ్డికి కానీ ఏ సీనూ లేదు. అప్పుడు అంటే 2007 నాటి కథలో భాగంగా మేం అంతా పరీక్ష రాసి ఇంట ర్వ్యూకు పోయినోళ్లం. నవ్వుకుంటాను నేను. ఆ ఇంటర్వ్యూలో అడిగినవాటికి దేనికీ నేను తిన్నంగా సమాధానం చెప్పనేలేదు. నీ కు ఏ పార్టీ అంటే ఇష్టం అని అడిగాడు రామకృష్ణ. మళ్లీ నవ్వుకుని ఏమీ చెప్పలేదు. పక్కనే పతంజలి ఉన్నాడు. ఆయన నా వై పు చూసి ఏదో ఒకటి చెప్పాలి కదా అన్నట్లుగా చూశాడు. అప్పటికే రాజశేఖర్ రెడ్డి ఉచిత పథకాలపై నాకు పెద్దగా నమ్మకం లేదు కనుక ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను. ఇంగ్లీషు వచ్చా..అనువాదాలు వచ్చా..అని మాత్రం అడిగాడు రామకృష్ణా.. ఏం రాకపోతే ఈ ఉద్యోగం రాదా అని మాత్రం మనుసులో అనుకుని వచ్చేశాను.
సాక్షి స్కూల్లో ఉన్నప్పుడు ఒక్కసారే వచ్చాడు ఆయన. ఆయన అంటే సజ్జల రామకృష్ణా రెడ్డి. పతంజలి (ఎడిటర్) కూడా ఒక్కసారే వ చ్చాడు. రాజ్యాన్ని నిరసించి రాతలు రాసిన వాడు అక్కడేంటి అని నవ్వుకున్నాను. ఎందుకంటే అప్పటికే ఆయన చాలా రాశాడు లేండి. నాలుగు స్తంభాలు అని చెప్పే లెజిస్లేటివ్, జ్యుడిషీయల్, పోలీస్,పేపర్ ఇలా వాటన్నింటిపైనా ఏవో రాశాడు లేండి. అందుకే అవి చదివిన నేను నవ్వుకున్నాను తరువాత..అవే రోజుల్లో ఓ రోజు కూకట్ పల్లికి వచ్చిన పాటల రచయిత అందెశ్రీ కూడా నాతో ఒక్కటే మాట అన్నాడు. ఇవన్నీ ఎందుకు ఆ ఆర్గనై జేషన్ నీకు సూట్ కాదు అక్కడ రాయడానికి ఏముంటుందని కూడా అన్నా డు. అప్పుడు కూడా నవ్వుకున్నాను.
ఇప్పుడు రామకృష్ణ చాలా పెద్దవాడు. ఒక నాటి కమ్యూనిస్టు ఇప్పుడు తమకు వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా ఒప్పుకోని వా డు. అవసరం అనుకుంటే పోలీసు బలగాలను ఉపయోగించేందుకు కూడా వెనుకాడని వ్యక్తిగా మారిపోయాడు. ఏ మాటకు ఆ మాటకు వస్తే సాయి రెడ్డి అంత డేంజర్ కాదు. వైవీ సుబ్బారెడ్డి అంత స్వార్థపరుడూ కాదు. ఇప్పటికీ సాహిత్యం అంటే ఇష్టం. కాస్తో కూస్తో కమ్యూనిస్టులకు మేలు కూడా చేశాడు. కమ్యూనిస్టు లీడర్ మధుకు ఆరోగ్యం బాగాలేకపోతే ప్రభుత్వం తరఫునే సాయం చేయించాడు. అలానే సీపీఐ కి కూడా కాస్తో కూస్తో ఫేవర్ చేసే గుణం ఉన్నవాడే! ఎందుకంటే ఈ మధ్యే సీమ కేంద్రంగా సీపీఐ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. మేం అంతా న్యాయ రాజధానికి సమ్మతమే అని.. ఆ స్టేట్మెంట్ వెనుక ఉన్నది మా రామకృష్ణే.. ఇదంతా ఎందు కు రాస్తు న్నానంటే ఆయన ఒకప్పుడు మాకో పెద్ద దిక్కు. ఇప్పుడు ప్రభుత్వానికో పెద్ద దిక్కు. అప్పుడూ ఇప్పుడూ కూడా మా పెద్దన్నయ్య. అన్నయ్య కదా! తప్పులు చేస్తాండు అని ఊరుకోలేం కదా! అందుకే ఈ పాటి రాశాను. డియర్ సర్ ఫీల్ కాకుండ్రి. ఇంకా బాగా పనిచేయుండ్రి.
మళ్లీ చెబుతున్నా ఇంగ్లీషు రాకపోయినా రాజశేఖర్ రెడ్డిపై ప్రేమ లేకపోయినా, చంద్రబాబు అంటే గిట్టక పోయినా, కేసీఆర్ అంటే విభేదం ఉన్నా, రేవంత్ రెడ్డి గొంతుకు నచ్చకపోయినా నా జీవితానికి వచ్చిన నష్టమేమీ లేదు. అన్నట్లు మీ శిష్యుడు సతీశ్ పర మ వేద ఊరికి ఉత్తరాన అనే సినిమా తీశాడు పోయి ఓ సారి చూసి రండి. థాంక్ యూ అన్నయ్య. మనం కలుద్దాం. ఒకనాడు జగ న్ ఆపద కాలంలో ఉన్నప్పుడు ఆయనకు మద్దతిచ్చా ను. అలానే టీవీ 9 హసీనా మేడమ్ ఏవేవో పిచ్చి ప్రశ్నలు మిమ్మల్ని అడి గితే అయ్యో ఇవేం ప్రశ్నలు అని బాధపడుతూ..వసంత కోకిల అతడు అని మీ గురించి రాశాను..అలా అని మీ అభిమానిని కాను కానీ నా కష్టం కాస్తయినా ఆ రోజు అర్థం చేసుకున్న మంచి మనిషి..ఇప్పటి ఎడిటర్ వర్థెల్లి మురళీ కన్నా..ఆ సేమ్యా కథల రైటర్ ఖ దీరు కన్నా మీ కన్నా బాగా రాయగలను అన్న పొగరుతో ఈ కథనం ముగిస్తా...
- రత్నకిశోర్ శంభుమహంతి