దాదాపు వారం రోజుల నుంచి ఆసక్తి రేపుతున్న కొండపల్లి మున్సిపల్ ఎన్నికకు సంబంధించి ఇప్పుడు సర్వత్రా కూడా ఆసక్తి రేగుతుంది. కొండపల్లి మున్సిపల్ ఎన్నికను నిరవధిక వాయిదా తో రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుంది అని ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. హైకోర్టు తీర్పు వస్తే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అంటున్న టీడీపీ నేతలు...కార్యాలయం లోనే కూర్చుని ఎన్నిక కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎంపీ కేశినేని నానీ టీడీపీ సభ్యులతో కలిసి అక్కడే ఉన్నారు.

బయటకు వచ్చేసిన వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్... కేశినేని నానీ లక్ష్యంగా  విమర్శలు చేసారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు అని మా సభ్యులు ఎటువంటి అల్లర్లు చేయలేదు అని స్పష్టం చేసారు. నాని  ఎన్నిక చెల్లదని మాత్రమే మేము అభ్యంతరం వ్యక్తం చేశామని ఆయన స్పష్టం చేసారు. ఎన్నికల అధికారి అధికారికంగా  వాయిదా వేసినట్లు ఆర్డర్ ఇచ్చారు అని వివరించారు. అందుకే బయటకు వెళ్లిపోతున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఎంపి నానీ ఓటు హక్కు విషయం కోర్టు పరిధిలో ఉంది అని తెలిపారు ఆయన. దాని మీద మేమేమీ మాట్లాడబోం అని స్పష్టం చేసారు.

కొండపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయిన ఎన్నికల అధికారి సునీల్ కుమార్  రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికకు అవకాశం లేకుండా పోయింది అని ఆయన తెలిపారు. సర్ది చెప్పినా సభ్యలు తగ్గలేదు అని అన్నారు. పరిస్థితి ఎన్నికకు అవకాశం లేకుండా మారిపోయిందని వివరించారు. అందుకే ఎన్నికను వాయిదా వేశాము అని ఆయన వ్యాఖ్యానించారు. లోపలే ఉన్న టీడీపీ  సభ్యులు గురించి అడిగితే... స్పందించకుండా ఆయన మీడియా వద్ద నుంచి వెళ్ళిపోయారు. ఇక తమకు న్యాయం చేయాలని రెండు పార్టీలు కూడా  డిమాండ్ చేసిన నేపధ్యంలో ఏం జరుగుతుందా అనే ఉత్కంట నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap