ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రధాని మోడీ పర్యటించారు. తన పర్యటనలో భాగంగా కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. గంగానదిలో పుణ్య స్నానం చేశారు. తర్వాత గంగానదిలో కలశంతో పుష్పాలను వదిలారు మోడీ. మోడీ వారణాసి పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూ ఏర్పాటు చేసిన కాశీ విశ్వనాథ్ నడవాను ప్రారంభించిన ప్రధాని మోడీ.. అందరికీ కాశీ విశ్వనాథుడి ఆశీస్సులు ఉంటాయన్నారు. కాశీ విశ్వనాథుడి పాదాలకు నమస్కరిస్తున్నట్టు చెప్పారు. ఎన్నో ఏళ్లు వేచి చూసిన సమయం ఆసన్నమైందన్నారు. కాశీలో అడుగుపెడితే అన్ని బంధాల నుంచి విముక్తి కలుగుతుందన్నారు ప్రధాని మోడీ. కాశీ చరిత్రలో ఈ రోజు నూతన అధ్యాయనం రచించినట్టు చెప్పారు. కాశీలో మృత్యువు కూడా మంగళమే అని మోడీ అన్నారు.

ప్రధాని మోడీ కాశీ పర్యటనలో భాగంగా కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడికి హారతి పట్టారు. కాశీ పురాణాల ప్రకారం ఈ స్వామిని దర్శించాకే.. విశ్వనాథుడి దర్శనం చేయుకోవాలంటారు. భూత ప్రేత యక్షరాక్షసాది సకల భయాలు తొలగిపోతాయనీ.. అపమృత్యు బాధల నివారణకు కాలభైరవుడికి పూజలు చేస్తారు. సమస్త విశ్వానికి అభయ ప్రదాతగా ఆయనను ఆరాధిస్తారు. ఈ కారణంగా ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ.. నిర్మాణ కార్మికులతో కలిసి లంచ్ చేశారు.కాశీ సుందరీకరణ పనులు, గంగానదిని కలుపుతూ ఏర్పాటు చేసిన కాశీ విశ్వనాథ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. దీని నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులతో కలిసి భోజనం చేశారు. మొత్తానికి ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ప్రధాని మోడీ ఆధ్యాత్మిక యాత్ర విజయవంతమైంది. కాలబైరవ ఆలయంలో నిర్వహించిన పూజలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.  అయితే ఆ పూజల విశిష్టతను తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ప్రధాని మోడీ అందుకా ఈ పూజలు నిర్వహించింది అని మనసులో అనుకుంటున్నారు.



 






 





మరింత సమాచారం తెలుసుకోండి: