ప్రియాంక చోప్రా.. తన అందంతో పాటు నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను ఫిదా చేసినా హాట్ బ్యూటీ. ఎన్నో సినిమాలో తనదైన స్టైల్లో ఫ్యాన్స్ ను  ఆకట్టుకున్న ఈ బాలీవుడ్‌ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్ లో సినిమాలో కూడా నటిస్తూ మిగతా ఏ హీరోయిన్స్ కి అందనంత ఎత్తులో ఉండిపోయింది. నిజానికి ప్రియాంక అంటే ఓ ఫైర్ బ్రాండ్ అంటారు అభిమానులు. కాంట్రవర్సీలకు పోకుండా..నెగిటివిటీని పట్టించుకోకుండా..తన పని తాను చూసుకుంటా అన్నట్లు.. కూల్ గా లైఫ్ ను ముందుకు తీసుకెళ్తుంది.

ఇక అమ్మడు సినిమాల పరంగా హాట్ టాపిక్ కాకపోయినా..వ్యక్తిగత విషయాల కారణంగా..మీడియాలో ప్రస్తుతం హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. తన కంటే వయసులో చిన్న వాడైన  నిక్ జోనాస్‌ ను పెళ్లి చేసుకుని అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ప్రేమకు పెళ్లికి వయసుతో పనిలేదంటుంది. ఇక అటు బాలీవుడ్ లోను ఇటు హాలీవుడ్‌ లోను ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్‌ జంటను  మోస్ట్‌ లవబుల్‌  కపుల్‌ అంటుంటారు. అంత ప్రేమ ఒకరికి ఒకరంటే.  బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ జంటగా నిలిచిన ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్‌.. విడాకులు తీసుకోబోతున్నారంటూ  ఈ మధ్య మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేసింది. అందుకు కారణం ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రోఫైల్‌ పేరు నుంచి భర్త నిక్‌ జోనస్‌ పేరును రిమూవ్ చేసేసింది. దీంతో  ఆమె ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ అంతా షాక్‌ అయ్యారు.

2018లో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన  ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్‌ లవ్‌బర్డ్స్‌ మధ్య ఏదో గర గరం గొడవలు నడుస్తున్నాయి అనుకుంటూ బాధపడ్డారు. ఈ జంట విడిపోకూడదు రా దేవుడా అని ప్రార్ధించారు. కానీ ఈ జంట హ్యాపీగా సంతోషంగా మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. మరి ప్రియాంక భర్త పేరు ఎందుకు తీసేసింది అనేగా మీ డౌట్..దానికి కూడా రీసెంట్ గా క్లారిటీ ఇచ్చింది. రీసెంట్ ఇంటర్వ్యుల్లో హోస్ట్ ఇలాంటి ప్రశ్నే అడగ్గ..ప్రియాంక రిప్లై ఇస్తూ..‘నా  సోషల్ మీడియా అకౌంట్లనీ కూడా ఒక్కే పేరుతో ఉండాలి అనుకున్నా .. ఇన్‌స్టాకు కూడా  అందుకే అలా మార్చాను తప్ప అంతకుమించి మరీ ఏం లేదు. నాకు ఏం తెలుసు ఇలాంటివి కూడా జనాలు సీరియస్ గా తీసుకుంటారు అని. ఈ విషయాని పెద్దది గా చేసి చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఇది జస్ట్ సోషల్ మీడియా అంతే..  చిల్ అవుట్’ అని క్లారిటీ ఇచ్చింది ప్రియంకా చోఫ్రా.  

మరింత సమాచారం తెలుసుకోండి: