సాధారణంగా మ్యూజియం లలో , కొన్ని ఆలయాల్లో వేటిని తాకకూడదన్న నిబంధన ఉంటుంది. అయితే ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ పట్టణంలోని ముక్తేశ్వర్ ఆలయం మాత్రం మినహాయింపు. ఆ  ఆలయం వారు అంధ విద్యార్థులకు మాత్రం అక్కడ ఉన్న ఆయా శిల్పాలను తాకి , వాటి కళా వైశిష్ట్యాన్ని అనుభూతించే అరుదైన అవకాశం కల్పించారు. 

ఆలయం వారు ప్రతి సంవత్సరం నిర్వహించే హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో ఒడిషా రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది అంధ విద్యార్థులు పాల్గొన్నారు. వారికి నిర్వాహకులు ఆ ఆలయం వెలిసిన ప్రదేశ చరిత్ర గురించి, ఆలయం చరిత్ర గురించి , ఆలయం కట్టడాల ప్రత్యేకత గురించి  వివరించే సాహిత్యాన్ని బ్రెయిలీ లిపిలో అందించడం విశేషం. 

ఒడిషా కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ యూత్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా చాలా మంది ఈ ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి నితురంజన్ దాస్ ఆలోచనే ఈ ఇండియన్ హెరిటేజ్ వాక్ కార్యక్రమం. 

తన ఆలోచన అమలు చేసేందుకు పలువురు ప్రముఖుల సహాయం తో ఒడిషా వ్యాప్తంగా ఉన్న చారిత్రిక ప్రదేశాలను, ఆలయాలను, మ్యూజియం లను అంధ విద్యార్థులు సందర్శించే కల్పించాలని కోరగా వారు అందుకు సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. దాస్ మొదటిసారి గా భువనేశ్వర్ లోని  ముక్తేశ్వర్ ఆలయం ద్వారానే ఈ కార్యక్రమం ప్రారంభించాలని తలిచి తన ఆలోచనలు ఆలయ అధికారులతో పంచుకోగా అందుకు వారి నుంచి సానుకూలంగా స్పందించారు. అలా మొదలైన ఈ కార్యక్రమం ఇప్పటికి దిగ్విజయంగా కొనసాగుతుంది. 


మ్యూజియం, దేవాలయాలలో  అంధ విద్యార్థులు కోసం తాక రాదు అనే పద్ధతి తీసేసి, ఓ సారి తాకండి అని పెడితే బాగుంటుంది అని అంటున్నారు నితురంజన్ .  


మరింత సమాచారం తెలుసుకోండి: