టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ గ‌త ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నియోజ‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఒడిపోయాడు. దీంతో ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా లోకేష్‌ను వైసీపీ నేత‌లు ఓ ఆటాడుకుంటున్నారు. ఇప్ప‌టీకీ లోకేష్ ఓట‌మిపై ఎగ‌తాళి చేస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో నారా లోకేష్ ఇప్పటి నుంచే పావులు క‌దుపుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నియోజ‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓట‌మి పాల‌వ్వ‌డంతో ఇక ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మారుతాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తే లోకేష్ ఆ నియోజ‌వ‌ర్గంలోనే పోటీ చేస్తార‌ని స్ప‌ష్టంగా కనిపిస్తోంది. 


దీని కోసం ఇప్ప‌టి నుంచే మంగ‌ళ‌గిరి నియోజ‌వ‌ర్గంలో వ‌రుసగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.  క్షేత్ర స్థాయిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వాళ్ల‌ను క‌లుస్తున్నారు. దీనికి తోడు వైసీపీ ప్ర‌భుత్వం రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి విశాఖ‌ప‌ట్నంకు మార్చాల‌ని చూస్తోంది.. దీనికి మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల కృష్ణారెడ్డి సహ‌క‌రించ‌డంతో.. లోకేష్ ఈ విష‌యాన్ని రాజ‌కీయ ఆయుధంగా మాల్చుకుంటున్నారు. దీంతో పాటు ఆళ్ల కృష్ణారెడ్డి మూడు సార్లు ఇక్క‌డ నుంచే పోటీ చేయ‌డంతో ఈ సారి ఆయ‌న‌కు వైసీపీ అధిష్టానం అవ‌కాశం ఇచ్చేలా క‌నిపించ‌డం లేదు. ఆర్కె పై వ్య‌తిరేక‌త పెరిగిపోతుండ‌డం, మూడు రాజ‌ధానుల విష‌యంలో త‌మ ఎమ్మెల్యే స‌హ‌క‌రించ‌డంతో మంగ‌ళ‌గిరి నియోజ‌వ‌ర్గం ప్ర‌జ‌లు ఆయ‌న మీద ఆగ్రహంగా ఉన్నార‌ని తెలుస్తోంది.


  దీంతో ఈ ప‌రిస్థితుల‌ను త‌నకు అనుకూలంగా మార్చుకునేందుకు నారా లోకేష్ మంగ‌ళ‌గిరి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. అలాగే, గ‌తంలో ఓడిపోయాడ‌నే సానుభూతి, ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక‌త, స్థానిక ఎమ్మెల్యే పై నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో వ్య‌క్తం అవుతున్న అస‌హ‌నం అన్నీ క‌లిపి నారా లోకేష్ కు రాబోయే ఎన్నిక‌ల్లో ఎంతో కొంత‌మేర లాభం చేకూర్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీనికి తోడు లోకేష్ కొత్త వ్యూహాల‌తో పాటు.. రైతుల‌కు ప్ర‌స్తుత ఎమ్మెల్యే అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా ఇబ్బంది పెట్టిన విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తున్నారు. దీంతో పాటు స్థానిక టీడీపీ నేత‌లు, నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ వెళ్తున్న లోకేష్ తీరుతో ఆయ‌న‌కు అనుకూలంగా మారుతున్నాయి.
       



 

మరింత సమాచారం తెలుసుకోండి: