
అలాంటి ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవడం కష్టమని పలు సర్వేలు తేల్చి చెప్పేస్తున్నాయి. అయితే వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బలంగా కనిపిస్తున్నారు. ఇక వీరిలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. అలా ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్న రెడ్డి ఎమ్మెల్యేలు కొందరు ఉన్నారు.
కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కాస్త యాంటీ పెరిగింది. ఇటు కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డి పరిస్తితి కూడా అంత బాగోలేదు. ఈ ఇద్దరికీ టీడీపీతో జనసేన కలిస్తే చెక్ పడటం గ్యారెంటీ. అటు నరసారావుపేటలో reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గురజాలలో కాసు మహేష్ రెడ్డిలకు కాస్త గడ్డు పరిస్తితులు ఉన్నాయి. అలాగే నగరిలో రోజా, పీలేరులో చింతల రామచంద్రారెడ్డిలకు యాంటీ కనిపిస్తోంది. రోజా అయితే సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. కదిరిలో సిద్ధారెడ్డికి మొదట నుంచి సెట్ కాలేదు.
ఈయన ఎక్కువ ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్న ఎమ్మెల్యే. అలాగే పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి, తాడిపత్రిలో పెద్దారెడ్డి, రాప్తాడులో ప్రకాష్ రెడ్డిల పరిస్తితి అంత బాగోలేదు. ఇక బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి, మంత్రాలయంలో బాలనాగిరెడ్డి, మైదుకూరులో శెట్టిపల్లి రఘురామిరెడ్డిలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల లిస్ట్‌లో ఉన్నారు. పైగా ఈ రెడ్డి ఎమ్మెల్యేల స్థానాల్లో టీడీపీ నేతలు కూడా పికప్ అవుతున్నారు. మొత్తానికి ఈ రెడ్డి ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పొచ్చు.