తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ముందు ఎవ‌రికైనా సూచ‌న‌లు ఫిర్యాదులు కానీ స‌మ‌స్య‌లు కానీ ఉంటే ఇవ్వ‌డానికి గ్రివెన్స్ బాక్స్ ను ఏర్పాటు చేయ‌బోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, రాజుల కాలంలో ధ‌ర్మ‌గంట‌ ఉన్న విధంగానే ఇప్పుడు రాజ్‌భ‌వ‌న్ ముందు గ్రివెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఈ బాక్సులో వేయ‌వ‌చ్చు. అయితే, ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లు వ‌స్తే వారు ఎన్నుకున్న ముఖ్య‌మంత్రికి, ప్ర‌భుత్వానికి చెప్పుకోవాలి. కానీ, గ‌వ‌ర్న‌ర్ ఈ ఫిర్యాదులు, సూచ‌న‌లు తీసుకుని మ‌ళ్లీ ప్ర‌భుత్వానికే పంపాల్సి ఉంటుంది.


  గ్రివెన్స్ బాక్స్ కేసీఆర్ ప్ర‌భుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంద‌న్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో  ఎంత కాద‌నుకున్న గ‌వ‌ర్నర్ బీజేపీ నాయ‌కురాలు. ఈ క్ర‌మంలో రాష్ట్రంపై బీజేపీ అధిష్టానం ఫుల్ ఫోక‌స్ పెట్టింది. అయితే, సాధార‌ణంగా ప్ర‌తిప‌క్ష నాయ‌కులు పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు స్వీక‌రించి ప‌రిష్క‌రించాల‌ని చూస్తారు. కానీ, గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, ఫిర్యాదులు ప‌రిష్క‌రణ‌కు గ్రివెన్స్ బాక్స్ ఏర్పాటు కేసీఆర్‌కు తంటాలు తెచ్చిపెడుతుందా అనే ప్ర‌శ్న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.


 వాస్త‌వానికి గ‌వ‌ర్న‌ర్ కు కొన్ని అంశాల్లో అధికారం ఉంటుంది. ఆదివాసి, గిరిజ‌న ప్రాంతాల అభివృద్ధి, విశ్వ‌విద్యాల‌యాల బాగు చేయ‌డానికి విశిష్ట అధికారాలు క‌లిగి ఉంటారు. అయితే, రాజ్యంగం క‌ల్పించిన అధికారాల‌ను ప‌క్క‌న బెట్టి పాల‌న‌ప‌ర‌మైన అంశాల జోలికి వెళ్తే ఎలాంటి ప‌రిస్థితులు ఏర్పాడుతాయ‌న్న రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు మొద‌ల‌వుతున్నాయి.  అయితే,  ఈ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ ను త‌ప్పు బ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు ఎందుకంటే గ‌తంలో త‌మిళ‌సై ప్ర‌భుత్వాన్ని పెద్ద‌గా ఇబ్బంది పెట్టిన దాఖ‌లాలు క‌నిపించ‌లేవు.


 మ‌రోవైపు ప్ర‌జా స‌మ‌స్య‌లు స్వీక‌రించి, వాటి ప‌రిష్క‌ర‌ణ‌కు ప్ర‌భుత్వానికి పంప‌డంలో త‌ప్పులేద‌న్న వాద‌న‌లు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. భ‌విష్య‌త్తులో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయ ప‌రిణామాల‌కు దారితీసే అవ‌కాశాలు ఉండ‌బోవ‌ని ఒక‌వేళ అలాంటి ప‌రిస్థితులే ఏర్ప‌డితే.. ప‌లు రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ ప్ర‌భుత్వం మ‌ధ్య కొన‌సాగుతున్న ఘ‌ర్ష‌ణ‌లు మాదిరిగానే తెలంగాణ‌లోనూ మారే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: