పాకిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు అధ్వానంగా మారిపోతున్నాయి. దేశ ప్రయోజనాలను గాలికి వదిలేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే పనిగా పెట్టుకుంది పాకిస్తాన్. ప్రపంచ దేశాలు మొత్తం పాకిస్తాన్ ను వెలివేస్తున్నప్పటికీ ఉగ్రవాదాన్ని వదిలేది లేదు  అన్న విధంగానే పాకిస్తాన్ వ్యవహరిస్తూ వస్తుంది. ఇక పాకిస్తాన్ లో పుట్టిన ప్రతి యువకుడు ఆయుధం పట్టాలి ఉగ్రవాదం లోకి రావాలి అన్న నానుడి తో ముందుకు సాగింది పాకిస్తాన్.  ఈ క్రమంలోనే భారత్లో కూడా ఇస్లామిక్ పాలన తీసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అక్రమంగా ఉగ్రవాదులను సరిహద్దుల నుంచి భారత్ లోకి పంపించి ఎన్నో మారణహోమాలు కూడా సృష్టించింది.


 ఇలా ఎన్నో ఉగ్ర కుట్రలకు పాల్పడిన పాకిస్థాన్ పై  ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఎఫ్ఎటీఎఫ్గ్రే లిస్టులో ఉండటం గమనార్హం. దీంతో కనీసం పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాని పరిస్థితి. అదే సమయంలో ఇక పాకిస్తాన్ అవసరాలకు ఉపయోగించుకుంటు ఆర్థిక సహాయం పేరుతో పాకిస్తాన్లో ఉన్న సహజ వనరులన్నింటినీ కూడా దోచు కుంటుంది. కనీసం ఉద్యోగావకాశాలు పాకిస్తాన్ వాళ్లకు కల్పించడం లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధ్, బేలుచ్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.



 ఒక వైపు ఐఎస్ఐఎస్ కె  తీవ్రవాదులు  పోలీసులపై తరచూ దాడులు జరుపుతూ ఉండటం సంచలనం గా మారిపోతుంది. అదే సమయంలో  సింధు ఆర్మీ  బెలూచ్ ఆర్మీ సైన్యంపై దాడి చేస్తూ దారుణంగా కాల్చి చంపుతుంది. ఇలా ఇటీవలి కాలంలో ఎంతోమంది పాకిస్తాన్ సైనికులు బెలూచ్ ఆర్మీ చేతిలో చనిపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఎప్పుడూ ఎవరు ఎటు నుంచి వచ్చే ఎటాక్ చేస్తారో అనే విధంగా మారిపోయింది పరిస్థితి పాకిస్తాన్లో.  ఇటీవలే పాక్ ఆర్మీ బేస్ మీద బెలూచ్ రెబెల్స్ చేసినటువంటి దాడిలో ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు.. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: