పిఆర్సి జీవోల రద్దు ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా చేస్తున్న సమ్మె రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తుంది అనే చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా కూడా మరింత మద్దతు కూడగట్టుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సంఘాలు పిఆర్సి జీవోల రద్దు ఇతర అంశాలపై ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు స్వచ్ఛందంగా మద్దతు పలికేందుకు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే ఆర్టీసీ సంఘాలు కూడా రంగంలోకి దిగి జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి.



 పిఆర్సి సాధన సమితికి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఇటీవలే ప్రకటించారు అన్న విషయం తెలిసిందే. వెంటనే ఏపీ ప్రభుత్వ  ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి అంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఇటీవలే దీనికి సంబంధించి విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ సంఘాల నేతలు మాట్లాడారు. ఉద్యమంలో ఆర్టీసీ సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన అన్ని రకాల ఆందోళనలు పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.



 ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని భావించామని.. కానీ ఇలా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం లో విలీనం చేయడానికి ఒకప్పుడు ఎందుకు అంగీకరించామా అని బాధ పడే పరిస్థితి వచ్చిందని ఆర్టీసీ జేఏసీ సంఘాల నేతలు అన్నారు. కార్మికులను ఆర్టీసీలో  విలీనం చేయడం వల్ల ఉన్న సౌకర్యాలు కూడా కోల్పోతున్నామని విలీనం అంటే ఇదేనా అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జేఏసీ సంఘాలు నేతలు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. పిఆర్సి పోరాట సమితి కి మద్దతు ఇస్తున్నాం.. వాళ్ళు ఎప్పుడు చెప్పిన సమ్మెకు సిద్ధంగా ఉన్నాం.. ఏ క్షణమైనా  అర్థరాత్రి అయినా బస్సులను ఆపేస్తాం... చాలీచాలని జీతాలతో ఆర్టీసీ ఉద్యోగులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు అంటూ ఆర్టీసీ జేఏసీ సంఘాల నేతలు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: