రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డికి కోపం ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు..అసలు ఇంకా తగ్గేలా కూడా లేదు. కోపాన్ని ఇలాగే కంటిన్యూ చేసేలా ఉన్నారు. మరి రేవంత్‌ని రాజకీయంగా బద్నామ్ చేయడానికే జగ్గారెడ్డి ఫిక్స్ అయినట్లు ఉన్నారు...అందుకే అధికార టీఆర్ఎస్‌పై పోరాటం చేయడం కంటే..రేవంత్ రెడ్డిపైనే ఎక్కువ పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అసలు రేవంత్‌కు పి‌సి‌సి అధ్యక్ష పదవి వచ్చిన దగ్గర నుంచి జగ్గారెడ్డి రచ్చ రచ్చ చేస్తూనే ఉన్నారు.

సరే రేవంత్‌కు పి‌సి‌సి రావడం చాలామంది సీనియర్లకు ఇష్టం లేదు...కానీ నిదానంగా ఆ సీనియర్లు సైలెంట్ అయ్యారు...కొందరు రేవంత్‌కు సపోర్ట్ చేస్తున్నారు. జగ్గారెడ్డి మాత్రం ఎప్పుడు ఏదొక రచ్చ తెరపైకి తీసుకోస్తూనే ఉన్నారు. ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు ఉంటే అంతర్గత సమావేశాల్లో చర్చిస్తే బాగుంటుంది...కానీ జగ్గారెడ్డి అలా కాదు ఓపెన్‌గానే విమర్శలు చేసేస్తున్నారు. అంటే రేవంత్‌ని నెగిటివ్ చేయడానికే ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమిపై రేవంత్‌ని టార్గెట్ చేసి మాట్లాడారు...ఆ తర్వాత రేవంత్ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఏదో పోరాటానికి పిలుపునిస్తే...అదిగో నాకు చెప్పకుండా పోరాటం ఏంటని చెప్పి...ఏకంగా రేవంత్‌పై ఫిర్యాదు చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాశారు. మరి ఫిర్యాదు లేఖని మీడియాకి వదిలారు. ఇలా ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి జగ్గారెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నట్లు కనిపిస్తున్నారు.

అయితే ఇటీవల కాంగ్రెస్ సభ్యత్వాల విషయంలో కూడా జగ్గారెడ్డి..రేవంత్‌ని కేర్ చేయని విధంగా ముందుకెళుతున్నారు. నియోజకవర్గానికి సుమారు 50 వేల సభ్యత్వాలు చేయాలని రేవంత్ టార్గెట్ పెట్టిన విషయం తెలిసిందే. కానీ జగ్గారెడ్డి తన నియోజకవర్గం సంగారెడ్డిలో 3 వేల సభ్యత్వాలు కూడా చేయలేదట. అంటే రేవంత్ ఏం చేసుకుంటాడో చేసుకోమని ఇలా చేశారా? లేక సభ్యత్వాలు చేయనని పరోక్షంగా చెబుతున్నారా? అనే అంశం కాంగ్రెస్ శ్రేణులకే అర్ధం కావడం లేదట. మొత్తానికి రేవంత్‌ని దెబ్బకొట్టడానికే జగ్గారెడ్డి బాగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: