ఇక అమెరికా జరిపిన మెరుపు దాడిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ (ఐఎస్ఐఎస్) కీలక నేత అబూ ఇబ్రహీం అల్ హషిమీ-అల్- ఖురేషీ ఆత్మాహుతికి పాల్పడటం జరిగింది. ఆయన నివసించే భవనం పైన హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టడంతో దాడి ఘటనను ముందుగానే ఊపించుకున్నాడని అమెరికా రక్షణ శాఖ వర్గాలు తెలిపడం జరిగింది.ఇక ఈ నేపథ్యంలో అమెరికా చేతిలో మరణించకూడదని అతను భావించి... ఆత్మాహుతి జాకెట్ వేసుకొని తనకు తానే పేల్చుకున్నాడని వెల్లడించడం జరిగింది. ఇక ఈ ఘటన సిరియా-టర్కీ సరిహద్దుల్లోని ఆత్మేహ్ ప్రాంతంలో జరిగినట్లుగా తెలిపాయి. ఇందులో ఖురేషీ కుటుంబానికి చెందిన మహిళలు పిల్లలు కూడా చనిపోయినట్లు అమెరికా అధికారులు తెలిపారు.ఇక ఖురేషీని హతమార్చడానికి స్పషల్ ఆపరేషన్ కోసం అమెరికా రక్షణ శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరించడం జరిగింది.అయితే ఖురేషీతో పాటు మరికొందరు అమాయకులు ఆ భవనంలో ఉంటున్న నేపథ్యంలో వారికి హానీ కలగకుండా ఉండేలా ప్లాన్ రూపొందించడం జరిగింది. ఇక ఆ ప్లాన్ ను డిసెంబర్ లో అగ్రరాజ్య రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ శ్వేతసౌధ అధ్యక్షుడు బైడెన్ ముందు ఉంచారు.

ఈ ముగ్గురూ కూడా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మెరుపు దాడికి సత్వరం ఏర్పాట్లు చేసుకున్నట్లు అగ్రరాజ్య రక్షణ శాఖ వర్గాలు వెల్లడించడం జరిగింది. కాగా ఈ ఆపరేషన్ కోసం డిసెంబర్ నుంచి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా బలగాలు పేర్కొనడం జరిగింది.ఇక పక్కా ప్లాన్ ప్రకారం ఖురేషీ నివాసం ఉంటున్న భవనంపై అమెరికా కమాండోలు హెలికాప్టర్ డ్రోన్ల సాయంతో కాల్పులు జరిపారు. ఇరువైపులా కూడా భీకర కాల్పులు జరిగాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే పది మందిని కాపాడగలిగారు. ఈ ఘటనలో అమాయకులైన మహిళలు ఇంకా చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక తనపై దాడి ఘటనను ఖురేషీ ముందుగానే పసిగట్టడం జరిగింది. అమెరికా చేతికి అసలు చిక్కకూడదనే ఉద్దేశంతో ఆత్మాహుతి జాకెట్ తో ఊపిరి తీసుకున్నాడని సిరియా వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆత్మాహుతి వల్లే అమాయకులు కూడా బలి అయ్యారని అగ్రరాజ్య రక్షణ శాఖ వర్గాలు తెలిపడం జరిగింది. ఇక డీఎన్ఏ ఆధారంగా ఖురేషీ మృతి చెందినట్లు గుర్తించామని స్పష్టం చయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: