కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్  మాణిక్కం ఠాకూర్  చేసినటువంటి వ్యాఖ్యలను టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. ఎవరి దయాదాక్షిణ్యాల వలన తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, ఆయన వ్యాఖ్యలపై కవిత తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రజా ఉద్యమం నడపడం ద్వారానే రాష్ట్రం సిద్ధించింది అని అన్నారు. అది బహుమతి కాదని తెలియజేశారు. నిజమైన పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని ఆమె అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీద అస్సాం ముఖ్యమంత్రి హీమంత భీశ్వ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. రాజకీయాలను పక్కన పెట్టి రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు అని తెలియజేశారు.
https://twitter.com/RaoKavitha/status/1493132472174792705?s=20&t=rhcknS6dk4Z3UCT4KPIYYQ
 అలాగే మాణిక్యం ఠాగూర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ కూడా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ టీం మరియు కోట్లాది మంది యువత సోనియమ్మ కోరుకున్న తెలంగాణ కొరకు పని చేస్తూనే ఉంటుందని, కానీ ఏడు సంవత్సరాలు అలా జరగలేదని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఊసరవెల్లి టిఆర్ఎస్, మతతత్వ భారతీయ జనతా పార్టీని  ఓడించాలని కోరారు. ఈ రెండు పార్టీలు ఒక నాణేనికి  రెండు పార్శ్వాలు అని కాంగ్రెస్ పార్టీ అలా చేయదని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ పై  స్పందించిన కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న మని, దీనికోసం కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రజా ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించదని 

ఆమె అన్నారు. పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమే కానీ ఎవరి దయాదాక్షిణ్యాలు అనేవి లేవని, విద్యార్థులు ప్రజా ఉద్యమాలే రాష్ట్రా ఏర్పాటుకు ఆజ్యం పోశయని ఆమె అన్నారు. ఎవరో ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని తిడితే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని, అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి అని కవిత పేర్కొన్నారు. దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని, అలా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని ఠాకూర్ కు కవిత చురకలంటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: