తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్న జగ్గా రెడ్డి తీరు ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది. రాహుల్, సోనియాకు జగ్గారెడ్డి లేఖ రాసి  సంచలనం రేపారు. అయితే టీ కాంగ్రెస్ నుంచి కొందరు నేతలు ఆయనను పార్టీ వీడద్దని కోరారు. భట్టి విక్రమార్క ఆయనతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇక ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కు రాజీనామా చేయాలని ఆయన అనుకోవడం లేదు. అందుకే అటూ ఇటూ కాకుండా ఇక కాంగ్రెస్ గుంపులో ఉండనంటూ లేఖ రాశారు. జగ్గారెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీని పదే పదే విమర్శించడం వెనుక ఎవరి వ్యూహం ఉందో అన్న అనుమానాలు కొందరు రేకెత్తించారు. ఇదే సమయంలో ఆయనకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పార్టీ మారిన చరిత్ర ఉందని కొందరు అంటున్నారు.

 మొదట ఆయన బీజేపీ, తర్వాత టిఆర్ఎస్,ఆ తర్వాత కాంగ్రెస్, మళ్లీ బీజెపీ,మళ్ళీ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఆయన కాంగ్రెస్ సంస్కృతి గురించి చెబుతూ రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో జరుగుతున్న రాజకీయంలో జగ్గారెడ్డి పావుగా మారారని కాంగ్రెస్ లోని ఓ వర్గం నేతలు కూడా నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. జగ్గారెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోక పోయినా ఇక ఆయనను పట్టించుకోకూడదు అన్న సంకేతాలు వెళ్లాయని టాక్. ఇప్పుడు కాంగ్రెస్ కు దూరం అయిన ఆయనను ఏ పార్టీ కూడా దగ్గరకు చేర్చుకునే అవకాశం లేదు. అయినా సరే ఇప్పుడు ఏ ఒక్కరిని దూరం చేసుకునే ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి లేరు. అందుకే జగ్గారెడ్డి ని కాంగ్రెస్ విడద్దని కోరారని అంటున్నారు.  ఇక జగ్గారెడ్డి కూడా బేషజాలకు పోకుండా కాంగ్రెస్ లోనే ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ముఖ్య అనుచరులతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈరోజుతో అవి ముగుస్తాయని, ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతున్నట్టే ప్రకటన రావచ్చని అంటున్నారు. ఈ లోపు అధిష్టానం నుంచి కూడా ఆయనకు ఫోన్ వెళ్లవచ్చని,అన్నీ సర్దుకుంటాయని టాక్ వినిపిస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: