నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు...ఇప్పటినుంచే నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే...రెండేళ్ళు పైనే ఎన్నికలకు సమయం ఉండగానే..బాబు అభ్యర్ధులని డిసైడ్ చేసేస్తున్నారు...ఇప్పటికే పలు చోట్ల అభ్యర్ధులని ఫిక్స్ చేశారు..ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని సీట్లు ఫిక్స్ అని చెప్పొచ్చు....జిల్లాలో 15 సీట్లు ఉన్న విషయం తెలిసిందే.

అయితే 15 సీట్లలో 5 సీట్లు మాత్రం ఫిక్స్ అయిపోయాయని చెప్పొచ్చు...జిల్లాలో టీడీపీకి రెండు సీట్లు ఉన్నాయి...పాలకొల్లు, ఉండి సీట్లు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి..ఇక పాలకొల్లులో రెండుసార్లు వరుసగా గెలిచిన నిమ్మల రామానాయుడు మూడో సారి కూడా బరిలో దిగడం ఖాయం...అలాగే విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఉండి ఎమ్మెల్యేగా మంతెన రామరాజు ఉన్నారు..కాకపోతే ఈయనకు నెక్స్ట్ సీటు ఇస్తారా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే ఈ సీటు వేటుకూరి శివరామరాజుకు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ సీటు విషయంలో క్లారిటీ లేదు.

ఇక తణుకులో మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేయడం ఫిక్స్...అటు ఆచంటలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పోటీ చేయనున్నారు. అలాగే దెందులూరు సీటు చింతమనేని ప్రభాకర్‌కు ఫిక్స్. ఇక ఉంగుటూరులో గన్నీ వీరాంజనేయులు పోటీ చేయనున్నారు. అంటే పాలకొల్లు, ఆచంట, ఉంగుటూరు, దెందులూరు, తణుకు సీట్లలో అభ్యర్ధులు ఫిక్స్ అని చెప్పొచ్చు.

అయితే జనసేనతో గాని పొత్తు ఉంటే కొన్ని సీట్లు ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది..అందుకే చంద్రబాబు కొన్ని సీట్లని ఫిక్స్ చేయకుండా ఉన్నారు..అదే సమయంలో కొన్ని సీట్లలో పోటీ ఎక్కువ ఉంది. చింతలపూడి, పోలవరం, కొవ్వూరు లాంటి సీట్లలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఏలూరు సీటు బడేటి చంటికి, గోపాలాపురం సీటులో ముప్పిడి వెంకటేశ్వరావుకు పోటీ చేసే అవకాశం ఎక్కువ ఉంది. మొత్తానికైతే వెస్ట్‌లో ఐదు సీట్లలో మాత్రం అభ్యర్ధులు ఫిక్స్ అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: