గత ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి బిగ్ షాక్ ఇచ్చినమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మరోసారి అదేరీతిలో అద్భుత విజయం సాధించారు. తాజాగా బెంగాల్ లో మమత హవా మరోసారి కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన  పది నెలల తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఎన్నికలు జరిగినా 108 మునిసిపాలిటీలలో 102 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 77 అసెంబ్లీ స్థానాలు దక్కించుకొని  బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన భాజాపా ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేక పోయింది.

 కాంగ్రెస్ కు సైతం ఒక్క సీటు దక్కలేదు. 27 మున్సిపాలిటీలలో విపక్షాలు అసలు ఖాతాలే తెరవలేదు. ఈ మున్సిపాలిటీలలోని అన్ని వార్డులను అధికార టిఎంసి గెలుచుకుంది. బిజెపి నేత సువెందు అధికారిక కంచుకోట అయిన కంథీ మున్సిపాలిటీ పైన టీఎంసీ జెండా ఎగురవేసింది. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ సువెందు కుటుంబమే అధికారం చెలాయిస్తోంది. ఈ ఫలితం సువెందు పట్టుకు గట్టి షాక్ గా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మమతను దెబ్బతీయాలని భావిస్తున్న బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇదే సమయంలో ఓ సరికొత్త రాజకీయ పార్టీ అనూహ్య ఫలితాన్ని సాధించింది. కొత్తగా ఏర్పాటైన హంరో పార్టీ  డార్జిలింగ్ మున్సిపాలిటీ ను దక్కించుకుంది. డార్జిలింగ్ లో హంరో పార్టీ టీఎంసీ బీజేపీలని ఓడించి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.

సిపిఎం ఆధ్వర్యంలోని వామ పక్ష కూటమి తహేర్ పూర్ మున్సిపాలిటీ లో విజయం సాధించారు. మిగిలిన నాలుగు మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. ఇక్కడి ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు ఎవ రికి దక్కనుందని ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయం పట్ల టీఎంసీ అధినేత్రి బెంగాల్ సీఎం మమతాబెనర్జీ హర్షం వ్యక్తం చేసారు. అనూహ్య మెజా రిటీతో గెలిచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: