ఎన్నో ఉత్కంఠ పరిస్థితుల మధ్య మొదలైన రష్యా , ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలై నేటికి 10 రోజులు అయ్యింది. అయినా యుద్ధం హడావిడి ఏమాత్రం తగ్గలేదు సరికదా ఇంకా ఉద్రిక్తత పెరిగింది. యుద్దాన్ని ఆపేందుకు ఉక్రెయిన్ దేశం సిద్దంగా ఉన్న రష్యా రణరంగంలో ఎంత మాత్రం తగ్గకపోవడంతో తిరుగుబాటు తప్పనిసరి పరిస్థితుల్లో తప్పడం లేదు. ఇప్పటికే లక్షకు పైగా ఈ యుద్ధం లో తమ ప్రాణాలను కోల్పోయారు. అయినా రష్యా అధ్యక్షుడికి కొంతైనా దయ కలగడం లేదు. పలు దేశాలు యుద్దాన్ని విరమించుకోవాలని విన్నవిస్తున్నా వినడం లేదు రష్యా అధిపతి పుతిన్. ఉక్రెయిన్‌లోని అతి పెద్ద జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ పై రష్యా దాడి చేసి హస్తగతం చేసుకున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇది ఐరోపా లోనే అతి పెద్ద పవర్ ప్లాంట్ అని తెలుస్తోంది.

అయితే ఈ విద్యుత్ కేంద్రం నుండి ఉక్రెయిన్ దేశం లో దాదాపుగా 70 శాతం కి పైగా విద్యుత్ సరఫరా జరుగుతోంది.  అయితే ఇపుడు రష్యావిద్యుత్ కేంద్రాన్ని అదుపులోకి తీసుకోవడం తో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా విద్యుత్ ని నిలిపి వేస్తే ఇది కనుక వర్కింగ్ లో లేకపోతే అందులో యూ న్నా రియాక్టర్లు వలన భారీ పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. మన దేశం లోనూ లాక్ డౌన్ సమయంలో పరిశ్రమలను మూసి వేయడం వలన మెషినరీ వర్కింగ్ లో లేక పలు చోట్ల పేలుళ్లు, గ్యాస్ లీకేజీ లు జరిగి భారీ నష్టాలు సంభవించిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రం లో సరఫరా నిలిపివేసే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని దానివలన చుట్టుపక్కల దేశాలకు సైతం ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ రోజు పొద్దున్న ఈ పవర్ ప్లాన్ నుండి మంటలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మరి ఈ అణు విద్యుత్ ప్లాంట్ కనుక విస్ఫోటనం చెందితే భారీ నష్టం జరుగుతుందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: