ఏపీలో వరుసగా కేంద్రమంత్రుల పర్యటన కొనసాగుతోంది. నిన్ననే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ఏపీకి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో రాష్ట్ర విభజన అనంతరం ఎన్నో ఇబ్బందుల నడుమ బయటకు వచ్చేశాము. అయితే రాష్ట్రానికి రాజధాని మరియు లక్షల మందికి ప్రాణాధారం అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ లు చాలా ముఖ్యం. నిన్న కేంద్ర మంత్ర్రి పోలవరాన్ని ఏపీ సీఎం జగన్ తో కలిసి సందర్శించారు. అక్కడ జరిగిన మరియు జరుగుతున్న పనులను పరిశీలించి ఒక కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పోలవరం కోసం ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయికి కేంద్రానిదే బాధ్యత అంటూ అతనిచ్చిన మాట ఏపీ ప్రజలకు సంతోషాన్ని కలిగించింది.

ఈ పర్యటన పూర్తి అవగానే నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటనకు వచ్చారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ప్రస్తుతం తన పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా సీతారామన్ పెనుకొండ దగ్గర గోరంట్ల పాలసముద్రం నాసిన్ కంపెనీ శంకు స్థాపన చేయడం జరిగింది. అయితే ఇది మాదక ద్రవ్యాల కు సంబంధించిన పరిశ్రమ అని తెలుస్తోంది. ఈ కంపెనీని మొత్తం 500 ఎకరాల్లో 600 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్నట్లు ఇది వరకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అకాడెమీ లో కేవలం ఐ ఆర్ ఎస్ కు ఎంపిక అయిన ప్రొబేషనరీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం.

అయితే ఈ సంస్థను నిర్మించడానికి 2015 లోనే కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పట్లో కేంద్ర మంత్రులుగా ఉన్న వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ లు ఇక్కడకు విచ్చేసి అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు సమక్షంలో భూమి పూజ చేశారు.  ఆ తర్వాత ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భూమి పూజ చేసింది. మరి దీని నిర్మాణం ఎప్పుడూ స్టార్ట్ అయ్యి  ఎప్పుడూ పూర్తి అవుతుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: