జనసేన ఆవిర్భావ సభపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. ఆవిర్భావ సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేస్తారంటూ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఆలోగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో పవన్ మాట మార్చేస్తారని కూడా కొంతమంది అంటున్నారు. ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగుతుండగా.. పవన్ సభ ఎలా జరుగుతుందనే విషయంలో కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు.

స్టేజ్ పై ఎవరికీ అవకాశం లేదు...
పార్టీ ఆవిర్భావ సభ అంటే అన్ని జిల్లాలనుంచి ముఖ్య నాయకులు వస్తారు, రాష్ట్ర స్థాయి నాయకులు, నాదెండ్ల మనోహర్, నాగబాబు.. ఇలా కీలక నేతలంతా స్టేజ్ పై ఉండాలి. సాంస్కృతిక కార్యక్రమాలు, నాయకుల ప్రసంగాలు సరే సరి. అయితే వీటికి భిన్నంగా పవన్ కల్యాణ్ స్టేజ్ పై తన ప్రసంగం మాత్రమే ఉండేలా ప్లాన్ చేయాలని చెప్పారట.

జనసేన ఆవిర్భావ సంబరాలు ఉదయాన్నుంచి మొదలవుతాయి. మధ్యాహ్నం తర్వాత సభ మొదలైనా ముగింపుకి గంట ముందు పవన్ కల్యాణ్ ఎంట్రీ ఉంటుందట. పవన్ ఎంట్రీకి ముందు ఇతర సభ్యుల ప్రసంగాలున్నా.. పవన్ వచ్చాక మాత్రం స్టేజ్ వన్ మ్యాన్ షో గా ఉంటుందని సమాచారం. గతంలో లాగా పవన్ కల్యాణ్ పుస్తకం చేతబట్టుకుని స్టేజ్ పైకి వచ్చి కీలక ఉపన్యాసం ఇచ్చి వెళ్లిపోతారని తెలుస్తోంది. అయితే అందులో కీలక అంశాలేంటనేది ప్రస్తుతానికి జిల్లా నాయకత్వానికి కూడా అంతు చిక్కడంలేదు.

పొత్తులపై కుండబద్దలు కొట్టేస్తారని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని, ఈసారి కాస్త గట్టిగానే పార్టీ శ్రేణులకు క్లాస్ తీసుకుంటారని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే.. నాదెండ్ల సహా చాలామంది నాయకులు పవన్ ప్రసంగంపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇంత హైప్ వచ్చిందంటే ఏదో గట్టి పాయింటే ఉంటుందనేది జనసైనికుల ఆశ. మరి దాన్ని పవన్ నిలబెడతారా..? నిజం చేస్తారా.. చూడాలి. పవన్ స్పీచ్ ఎలా ఉన్నా.. జనసైనికుల హుషారు మాత్రం వేరే లెవల్ లో ఉంటుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: